Delhi Voter List:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం దాదాపుగా సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించిన ఈసీ అధికారులు జనవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 15, 2025తో ముగుస్తుంది. ఈలోగా, ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ నేపథ్యంలో రాజధాని ఓటరు జాబితాలో భారీ మోసం బయటపడింది. ఢిల్లీ నకిలీ ఓటర్లు, అధికారుల పనితీరు బహిర్గతం అయింది. త్రిలోక్‌పురి అసెంబ్లీ నియోజకవర్గం న్యూ అశోక్ నగర్ మండలంలో ఈ నకిలీ ఓట్లు బయటపడ్డాయి. ఇక్కడ 4 అంతస్తుల ఇంటి చిరునామాలో 38 నకిలీ ఓట్లు బయటకు వచ్చాయి. ఈ నకిలీ ఓటర్లను ఎవరూ చూడలేదు. ఈ ఇంటిలో ముగ్గురు అద్దెకు ఉంటున్నారు. అధికారులు మరి ఎలా గుర్తింపు కార్డులు ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు.
న్యూ అశోక్ నగర్‌లో 4 అంతస్తుల ఇల్లు ఉంది. దీని నంబర్ బి-174. ఈ ఇంట్లో 30 నుంచి 35 గదులు ఉన్నాయి. ఇందులో సమీపంలోని ఫ్యాక్టరీలలో పని చేస్తూ అద్దెకు జీవిస్తున్నారు. ఇందులో నివసించని 38 మందికి ఈ ఇంటి చిరునామాపై ఓటరు గుర్తింపు కార్డులను మంజూరు చేశారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారి గురించి మాకు ఎలాంటి సమాచారం లేదని ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తులు తెలిపారు.అలాంటి వారిని ఎప్పుడూ చూడలేదని వారు చెప్పుకొచ్చారు.
ఇంతమంది ఇక్కడ నివసించడం లేదని ఇంట్లో అద్దెకు ఉంటున్న మరో వ్యక్తి చెప్పాడు. ఇంతమందిని మనం ఎప్పుడూ చూడలేదు. మరో వ్యక్తి మాట్లాడుతూ.. నేను మూడు నెలలుగా ఇక్కడ నివసిస్తున్నాను, కానీ ఇంతమందిని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు. వీరంతా ఇక్కడ ఉండే వాళ్లు మాత్రం కాదు. నేను ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉన్నాను వీళ్లెవరినీ చూడలేదన్నారు.
ఓటరు జాబితాపై ఉత్కంఠ
ఢిల్లీలోని అన్ని సమస్యలతో పాటు, ఓటరు జాబితా విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి మధ్య ఇప్పటికే వివాదం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. ఇందులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ బహిరంగంగా డబ్బులు పంచిందని, పూర్వాంచల్, దళిత ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కేజ్రీవాల్‌కు బీజేపీ సలహా
దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ రాసిన లేఖ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని ఆయన ఆరోపించారు. సంఘ్ నుండి నేర్చుకోండి, లేఖలు రాయవద్దు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సేవా భారతి దేశంలోనే అతిపెద్ద సంస్థ, ఇది మురికివాడల ప్రజలతో సహా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని సుధాన్షు త్రివేది అన్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: 38 votes at the same house address in delhi voter list
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com