Homeఅంతర్జాతీయంJaved Akhtar : పాకిస్తాన్ కు వెళ్లి మరీ భారత్ గురించి గొప్పగా మాట్లాడి.. జావేద్...

Javed Akhtar : పాకిస్తాన్ కు వెళ్లి మరీ భారత్ గురించి గొప్పగా మాట్లాడి.. జావేద్ నీది ఏం గుండె స్వామీ!

Javed Akhtar : పాక్… ఓ ఉగ్రవాద దేశం. అక్కడి ప్రజలకు కనీస హక్కులు కూడా కల్పించలేని దేశం ఎక్కడ బాంబులు పేలుతాయో, ఎక్కడ జనం చచ్చిపోతారో తెలియదు..పైగా అక్కడి ఉగ్రవాద తండాలు తుపాకులతో స్వైర విహారం చేస్తుంటాయి. అందుకే పాక్ వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. అందునా భారతీయులు అస్సలు వెళ్ళరు. కానీ బాలీవుడ్ గీత రచయిత జావేద్ ఆఖ్తర్ ఇటీవల పాకిస్తాన్ వెళ్లారు.

స్వేచ్ఛగా సంచరిస్తున్నారు

పాకిస్థాన్‌ వెళ్లిన జావేద్ అక్తర్, 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితులు ఇప్పటికీ ఈ దేశంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నారని, దానిపై భారతీయులకు ఫిర్యాదులు ఉన్నాయని అక్కడ జరిగిన సభలో గుర్తు చేశారు. లాహోర్‌లో ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఉత్సవానికి అక్తర్ హాజరయ్యారు. అక్తర్ వీడియో క్లిప్ తనతో పాటు శాంతి సందేశాన్ని తీసుకువెళ్లాలని, పాకిస్తాన్ “సానుకూల, స్నేహపూర్వక ప్రేమగల దేశం” అని భారతీయులకు చెప్పమని ఆ వ్యక్తి కోరాడు. అంతే కాదు “మీరు చాలాసార్లు పాకిస్థాన్‌ను సందర్శించారు… మీరు తిరిగి వెళ్లినప్పుడు మీ ప్రజలకు వీరు మంచి వ్యక్తులు అని చెబుతారా, వారు మాపై బాంబులు వేయడమే కాకుండా దండలు వేసి ప్రేమతో పలకరిస్తున్నారు?” అని ప్రేక్షకుల్లో ఉన్న వ్యక్తి జావేద్ ను అడిగాడు.

మనం ఒకరినొకరు నిందించుకోకుడదు

దీనికి అక్తర్ బదులిస్తూ, “మనం ఒకరినొకరు నిందించుకోకుడదు. అది సమస్యలను పరిష్కరించదు.  వాతావరణం చల్లబడాలి. నేను బొంబాయి నుంచి వచ్చాను. మనమందరం కూడా బొంబాయిపై దాడిని చూశాము. దాడి చేసినవారు నార్వే లేదా ఈజిప్టు నుంచి వచ్చినవారు కాదు. వారు మీ దేశంలో ఇప్పటికీ ఉన్నారు, కాబట్టి భారతీయులు దీని గురించి ఫిర్యాదు చేస్తే మీరు బాధపడకూడదు.

కంగనా ప్రశంసలు

26/11: ‘ఘర్ మే ఘుస్ కే మార’ అని పాకిస్థానీలకు భారత్ ఎప్పటికీ మరచిపోదని చెప్పినందుకు జావేద్ అక్తర్‌ను కంగనా రనౌత్ ప్రశంసించింది. 26/11 దాడుల గురించి పాకిస్తాన్‌లో ఒక సమావేశానికి ముందు చేసిన వ్యాఖ్యలను ఆమె హృదయపూర్వకంగా స్వాగతించింది. ఇక అక్తర్ గతంలో రనౌత్‌పై పరువు నష్టం కేసు వేశారు.2020లో గీత రచయిత జావేద్ అక్తర్ పరువునష్టం కేసుతో  ఇరుకునపడ్డ నటి కంగనా రనౌత్.. 26/11 ఉగ్రవాద దాడుల గురించి ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రశంసించారు. మంగళవారం ట్విటర్‌లో జావేద్ అక్తర్ వ్యాఖ్యల వీడియోను కంగనా రీపోస్ట్ చేస్తూ, ” నేను అతని కవిత్వం విన్నప్పుడు, నేను అతని జ్ఞానానికి విస్మయానికి లోనయ్యాను. ఇప్పుడు అతని వ్యాఖ్యలు నిజమైన భారతీయుడు అని రుజువు చేసాయి.” అంటూ ట్వీట్ చేసింది. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఎవరు ఎటువైపు నుంచి గన్ తో కాల్చేస్తారో తెలియని పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి మరీ ఓ భారతీయుడు ధైర్యంగా మాట్లాడడం.. పాక్ గడ్డ మీదే పాక్ ను తప్పుపట్టడం.. ఆ వివరణకు పాకిస్తానీయులు కూడా చప్పట్లు కొట్టడం నిజంగా అరుదు. అలాంటి అరుదైన ఘనతను, ధైర్యాన్ని చూపిన జావేద్ అక్తర్ పై ఇప్పుడు ఇండియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.జావేద్ ది ఏ గుండె స్వామీ నీది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular