ఈసారి హరితహారంలో 20 కోట్ల మొక్కలు

ఆరో విడత హరితహారం ఈ నెల 20నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 కోట్ల మొక్కలు నాటడమే లక్షంగా పెట్టుకున్నారు. జంగల్ బచావో….జంగల్ బడావో (అడవిని కాపాడుదాం….అడవిని విస్తరిద్దాం) అనే నినాదంతో సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ, పంచాయితీలు, పురపాలిక సంస్థలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు కూడా పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు రంగం సిద్దం చేశారు. ఆ ఏర్పాట్లన్నీ […]

Written By: Neelambaram, Updated On : June 15, 2020 11:39 am
Follow us on


ఆరో విడత హరితహారం ఈ నెల 20నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 కోట్ల మొక్కలు నాటడమే లక్షంగా పెట్టుకున్నారు. జంగల్ బచావో….జంగల్ బడావో (అడవిని కాపాడుదాం….అడవిని విస్తరిద్దాం) అనే నినాదంతో సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ, పంచాయితీలు, పురపాలిక సంస్థలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు కూడా పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు రంగం సిద్దం చేశారు. ఆ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో 20వ తేదీ నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐదు విడతల్లో కోట్ల సంఖ్యల్లో మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మొక్కలు నాటిన ప్రాంతాలన్నీ పచ్చటి వనాలుగా మారుతున్నాయి.

ఆరవ విడత హరితహారంలో భాగంగా రైతులకు అదనపు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను పెంచడమే లక్షంగా మొక్కలను పెంచనున్నారు. వర్షాలకు అనుగుణంగా హరితహారం కొనసాగించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తగు ఆదేశాలు జారీ చేసింది. గంధం, టేకు, వెదురు, సరుగుడు, చింత, పూలు, పండ్ల మొక్కలకు కూడా పెద్దఎత్తున ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్రతి జిల్లాలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మియావాకీ పద్దతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో చిట్టడవులను పెంచేందుకు ప్రణాళికలను సిద్దం చేశారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో నర్సరీలకు అటవీ శాఖ సాంకేతిక సహకారాన్ని అందించనుంది.

గ్రామాల్లో ఇంటింటికి ఆరు మొక్కలు ఇవ్వటం, బాధ్యతగా పెంచేలా పంచాయితీల పర్యవేక్షణ చేస్తాయి. కోతుల బెడద నివారణ కోసం ప్రత్యేకంగా గుర్తించిన 37 రకాల మొక్కల జాతులను క్షీణించిన అటవీ ప్రాంతాల్లో నాటే ప్రణాళికలను కూడా అమలు చేయనున్నారు. వానలు వాపస్ రావాలి… కోతు లు అడవులకు వాపస్ పోవాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున మొక్కలను పెంచుతున్నారు.