ఇంతకీ చంద్రబాబుని తిట్టావా? పొగిడవా?..జేసీ

రాజకీయాల్లో తల పండిన నేతల్లో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. ఇప్పుడు ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రైవేటు బస్సుల వ్యాపారం కోసం నానా అక్రమాలు చేసి దొరికిపోయిన తన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎలా వెనకేసుకురావాలో తెలియక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబు అగ్నిగుండమని, అందులో ఎవరు కాలిపోతారో తెలియదన్నారు. జగన్ కూడా […]

Written By: Neelambaram, Updated On : June 15, 2020 11:49 am
Follow us on


రాజకీయాల్లో తల పండిన నేతల్లో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. ఇప్పుడు ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రైవేటు బస్సుల వ్యాపారం కోసం నానా అక్రమాలు చేసి దొరికిపోయిన తన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎలా వెనకేసుకురావాలో తెలియక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబు అగ్నిగుండమని, అందులో ఎవరు కాలిపోతారో తెలియదన్నారు. జగన్ కూడా కాలిపోవచ్చని జేసీ దివాకర్ రెడ్డి శాపనార్దాలు పెట్టారు. ఈ కామెంట్స్ లో చంద్రబాబుని తిట్టాడో..?లేక పొగిడాడో..? తెలియడం లేదు.

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి అమ్మేసుకున్న కేసులో తన తమ్ముడు దోషి కాదని, ఆ వాహనాలు అమ్మిన అశోక్ లేల్యాండ్ సంస్ధ, రిజిస్టర్ చేసిన అధికారులే నిందితులని జేసీ కామెంట్స్ చేశారు. వీరిని వదిలిపెట్టి తన తమ్ముడిని మాత్రమే అరెస్టు చేశారన్నారు. ఇది జగన్ సర్కారు కక్షసాధింపులో భాగమేనన్నారు. అధికారులెవరూ సరిగా పనిచేయడం లేదని, జగనే సర్వం అన్నట్లు పాలన సాగిస్తున్నారని జేసీ ధ్వజమెత్తారు. తన బస్సులు నిలిపివేయించి రూ.40 కోట్ల పైన్ వేశారన్నారు. తనతో పాటు మరికొందరిని కూడా అరెస్టు చేసే అవకాశముందని జేసీ జోస్యం చెప్పారు.