దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లకు అనుమతిచ్చాక అవి దేశంలో పంచకుండా కేవలం వైద్యులు, సిబ్బందికి మాత్రమే వేసి ఇతర దేశాలకు, పక్క దేశాలకు మోడీ పంచేశారు. పక్కదేశాలతో మన సంబంధాల కోసం ఇలా చేశారు.
నాడు కరోనా తగ్గిపోయిన పరిస్థితుల్లో ఇక దేశానికి ఏం కాదు అని మోడీ అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ వచ్చింది. దేశంలో ఎన్నో అనర్థాలకు కారణమైంది. ఆక్సిజన్ కొరత బెడ్స్ దొరక్క అల్లాడిపోయాయి. ఇక 18-45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ చేపట్టినా ఇప్పటివరకు అది సాగలేదు. మోడీ సార్ ఫెయిల్ అయ్యారని ఎన్నో విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఢిల్లీలో తాజాగా పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలోని గోడలపై ‘పీఎం మోడీ గారు మన పిల్లల వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపారు?’ అని రాసి ఉన్న పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాల్లో అతికించారు. ఈ పోస్టర్లకు సంబంధించి పోలీసులకు తాజాగా సమాచారం అందింది. తూర్పు ఢిల్లీలోని కళ్యాణ్ పురి ఏరియాలో తాజాగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాని మోడీని విమర్శిస్తూ ఉండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 800 పోస్టర్లను, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం పోస్టర్లలో ప్రశ్నించిన 17మందిని గుర్తించి అరెస్ట్ చేశారు.
సెకండ్ వేవ్ ను గుర్తించకుండా మోడీ వ్యాక్సిన్లను పక్కదేశాలకు పంచేశాడని.. ఇప్పుడు దేశంలో వ్యాక్సిన్ల కొరతకు మోడీనే కారణమని పోస్టర్లలో విమర్శించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో బీజేపీని విమర్శించిన వారిపై కేసులు నమోదు కాగా.. తాజాగా పోస్టర్లలో విమర్శించిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.