https://oktelugu.com/

Bandi Sanjay : 14 రోజుల రిమాండ్.. బండి సంజయ్ ని ఇరికించేశారా?

Bandi Sanjay : తెలంగాణ రాజకీయాలను పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం కుదిపేస్తోంది. ఈ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.., ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు  బండి సంజయ్ కు 14 రోజులు రిమాండ్ విధిస్తూ షాకిచ్చింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో ఉద్రిక్తతకు దారితీసింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే బండి సంజయ్ ను అరెస్టు చేశారన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : April 5, 2023 / 09:58 PM IST
    Follow us on

    Bandi Sanjay : తెలంగాణ రాజకీయాలను పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం కుదిపేస్తోంది. ఈ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.., ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు  బండి సంజయ్ కు 14 రోజులు రిమాండ్ విధిస్తూ షాకిచ్చింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో ఉద్రిక్తతకు దారితీసింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే బండి సంజయ్ ను అరెస్టు చేశారన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.

    తెలంగాణలో పదో తరగతి పేపర్ లీక్ కేసు క్షణక్షణం ఉత్కంఠ ను రేపుతోంది.  కోర్టు బండి సంజయ్ కు 14 రోజులపాటు ఏప్రిల్ 19 వరకు రిమాండ్ విధించగా ఖమ్మం జైలుకు తరలించారు. బండి సంజయ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. ఈ కేసులో ఏకంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చేయడం అలాగే ఆయనను ఏ1 గా చేర్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. అర్ధరాత్రి ఒంటిగంటకు బండి సంజయ్ అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకూ తిప్పారు. మధ్యాహ్నం హనుమకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత రాపోలు ముందు హాజరు పరిచారు.

    అక్రమంగా అరెస్టు చేశారంటూ వాదనలు..

    న్యాయమూర్తి ఎదుట సుదీర్ఘ వాదనలు జరిగాయి. బండి సంజయ్ తరఫున వాదించిన న్యాయవాదులు.. అక్రమంగా అరెస్టు చేసినట్లు వాదనలు సాగించారు. మెజిస్ట్రేట్ తీర్పు నేపథ్యంలో హనుమకొండ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక అంతకుముందు బండి సంజయ్ తనను అరెస్టు చేసిన విధానం, పోలీసులు తీరుపై తన న్యాయవాదులకు వివరించారు. షర్టు విప్పి ఒంటిపై గాయాలను బండి సంజయ్ న్యాయవాదులకు చూపించారు. చివరకు  ఆయనను పోలీసులు ఖమ్మం  జైలుకు తరలిస్తున్నారు. రిమాండ్ విధించడంతో సంజయ్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

    రాజకీయ కక్ష సాధింపులేనా..

    తెలంగాణ రాజకీయాల్లో కెసిఆర్ కు వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్న నాయకుల్లో బండి సంజయ్ ఒకరు. ఆయన రాజకీయంగా చేసే విమర్శలను తట్టుకోలేక కేసీఆర్ ప్రభుత్వం ఈ విధంగా అడ్డగోలు చర్యలకు పాల్పడిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ కు ఎలాంటి ప్రమేయం ఉంటుందని అందుకు ఆస్కారం ఎక్కడ ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే అక్రమంగా కేసు బనాయించారన్న విమర్శలు ఆ పార్టీ నాయకులు నుంచి వ్యక్తం అవుతున్నాయి.

    కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నది..

    టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ-1 గా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు రిమాండ్ రిపోర్టులో చేర్చారు. A2 బోర ప్రశాంత్, A3 గా మహేష్, A4 గా బాలుడు, A5 గా మోతం శివ గణేశ్, A6 గా పోగు సుభాష్, A7 గా పోగు శశంక్, A8 గా దులం శ్రీకాంత్, A9 గా పోతబోయిన వసంత్ ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో చేర్చారు.

    పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా కుట్ర..

    ఇకపోతే పరీక్షలు వ్యవస్థను దెబ్బతీసేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. వికారాబాద్, కమలాపూర్ లో పేపర్ లీకేజీలపై బండి సంజయ్ ప్రెస్ నోట్ ఇచ్చారని, పేపర్ లీకేజీలకు ప్రభుత్వం బాధ్యత అంటూ విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించాలని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని, పరీక్షల నిర్వహణకు విగాథం కలిగేలా ఆందోళనలు చేయాలని బిజెపి శ్రేణులకు ఉద్దేశపూర్వకంగానే పిలిపించాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షల నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అందుకే ముందస్తుగా అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. అనేకమంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, పరీక్షలకు విఘాతం కలుగుకుండా ఉండేందుకే బండి సంజయ్ను ప్రివెన్షన్ కింద అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.