
Salaar: ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’.KGF సిరీస్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు ఇదివరకే మూవీ మేకర్స్ ప్రకటించి చాలా కాలం అయ్యింది.
ఇప్పుడు షూటింగ్ చివరి దశకి చేరుకోవడం తో మరోసారి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు అధికారికంగా ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు.ఇందులో హీరోయిన్లు గా శృతి హాస్సన్ మరియు మీనాక్షి చౌదరి నటించగా, విలన్స్ గా జగపతి బాబు మరియు మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.KGF సిరీస్ కి సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.త్వరలోనే మంచి అకేషన్ ని చూసి టీజర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఏమిటంటే, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట.కథ రెండవ భాగాన్ని కూడా డిమాండ్ చేస్తుంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

రీసెంట్ సమయం లో హాలీవుడ్ తరహాలో ఇక్కడ కూడా ‘వర్స్’ కాన్సెప్ట్ ని ఫాలో అయ్యిపోతున్నారు.అంటే గతం లో తీసిన సినిమాలకు లింక్ పెడుతూ , ప్రస్తుతం సినిమాలను కలపడమే.అలా సలార్ మరియు KGF సిరీస్ కి కూడా లింక్ ఉంటుందట.ఇలా ఎన్నో ప్రత్యేకతలతో నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరికొన్ని విషయాలు అతి త్వరలోనే తెలియనున్నాయి.