https://oktelugu.com/

కొరియాకు 13వేల టన్నుల స్టైరీన్..!

విశాఖపట్నంలో దుర్ఘటనకు కారణమైన ఎల్.జి పరిశ్రమ నుంచి ఐదు ట్యాంకులలో ఉన్న స్టైరీన్ దక్షిణ కొరియా తరలించే ప్రక్రియను పరిశ్రమ యాజమాన్యం ప్రసారంభించింది. స్టైరీన్ లీకేజీ సంభవించిన ట్యాంకులో ప్రస్తుతం 73 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉందని, సురక్షిత స్థాయిలో ఉందని వెల్లడించిన జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ట్యాంకులోని స్టైరీన్ కూడా దాదాపు 100శాతం పాలిమరైజ్‌ అయ్యిందన్నారు. ఇదికాక ఇంకో ఐదు ట్యాంకుల్లో 13వేల టన్నుల స్టెరెన్‌ ఉందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం దీన్ని కొరియాకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 11, 2020 / 03:35 PM IST
    Follow us on

    విశాఖపట్నంలో దుర్ఘటనకు కారణమైన ఎల్.జి పరిశ్రమ నుంచి ఐదు ట్యాంకులలో ఉన్న స్టైరీన్ దక్షిణ కొరియా తరలించే ప్రక్రియను పరిశ్రమ యాజమాన్యం ప్రసారంభించింది. స్టైరీన్ లీకేజీ సంభవించిన ట్యాంకులో ప్రస్తుతం 73 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉందని, సురక్షిత స్థాయిలో ఉందని వెల్లడించిన జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ట్యాంకులోని స్టైరీన్ కూడా దాదాపు 100శాతం పాలిమరైజ్‌ అయ్యిందన్నారు.
    ఇదికాక ఇంకో ఐదు ట్యాంకుల్లో 13వేల టన్నుల స్టెరెన్‌ ఉందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం దీన్ని కొరియాకు తరలిస్తున్నామని వెల్లడించారు.తరలింపునకు 8వేల టన్నులను రెండు వెసల్‌ అందుబాటులో ఉండటంతో మార్గం సుగమమైంది. తరలింపు ప్రక్రియ రానున్న 4 నుంచి 5 రోజుల్లో పూర్తి చేయనున్నారు.

    మరోవైపు ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం ఆదేశించిన విధంగా 8 మందిలో 5 గురికి నష్ట పరిహారం అందించారు. మిగిలిన వారికి పరిహారం చెల్లించేందుకు సిద్ధం చేశారు.గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్‌ పనులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటలకల్లా ఇవి ముగుయనున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలను ఊళ్లలోకి అనుమతిస్తున్నామని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో మంత్రులు తెలిపారు. బాధితులు చాలామంది ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారని, ఎక్స్‌టర్నల్‌, శానిటేషన్, ఇంటర్నెల్‌ శానిటేషన్‌పై నిపుణులు స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ ఇచ్చారు, దాని ప్రకారమే శానిటేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.