https://oktelugu.com/

ఎల్జీ పాలిమర్స్ మీడియాను ఎందుకు అడ్డుకున్నారు!

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ, ప్రభావిత ప్రాంతాల్లోకి మీడియాను అనూహ్యంగా సోమవారం అడ్డుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు లేని ఆంక్షలు అకస్మాత్తుగా తెరపైకి తీసుకు వచ్చి, మీడియాకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ప్రభుత్వం ఏదో దాచే ప్రయత్నం చేస్తున్నడనే అభిప్రాయం కలుగుతున్నది. కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన దర్యాప్తు కమిటీ సభ్యులు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆధారాలన్నీ తుడిచే ప్రయత్నం జరుగుతుందని బైట కధనాలు వెలువడు తున్నాయి. అందుకోసమే ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 11, 2020 7:20 pm
    Follow us on

    విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ, ప్రభావిత ప్రాంతాల్లోకి మీడియాను అనూహ్యంగా సోమవారం అడ్డుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు లేని ఆంక్షలు అకస్మాత్తుగా తెరపైకి తీసుకు వచ్చి, మీడియాకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ప్రభుత్వం ఏదో దాచే ప్రయత్నం చేస్తున్నడనే అభిప్రాయం కలుగుతున్నది.

    కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన దర్యాప్తు కమిటీ సభ్యులు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆధారాలన్నీ తుడిచే ప్రయత్నం జరుగుతుందని బైట కధనాలు వెలువడు తున్నాయి. అందుకోసమే ఈ ప్రాంతాల్లో ఎవ్వరిని రానీయడం లేదని ఆంక్షలు పెడుతున్నారని చెప్పుకొంటున్నారు.

    గ్యాస్ ప్రభావంతో ప్రాణాలకు ముప్పు ఉందని, ఎవరు గ్రామంలోకి రావద్దని పోలీసులు చెబుతున్నారు. గ్రామంలోకి శుద్ధి చేయడానికి వెళ్తున్న జీవీఎంసీ అధికారులను కూడా బయటకు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడంతో గ్రామస్తులు అయోమయం వ్యక్తం చేస్తున్నారు.

    ఆధారాలు ఏవీ కనిపించకుండా చేయడం కోసం ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు, వీధులను జీవీఎంసీ సిబ్బంది శుద్ధి చేస్తున్నారు. పాలిమర్స్ కంపెనీ ప్రభావిత ప్రాంతమైన వెంకటాపురంతో పాటు మిగిలిన గ్రామాల్లో క్లోరినేషన్, నీటితో ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. అలాగే విషవాయువులకు దెబ్బతిన్న చెట్లను తొలగిస్తున్నారు. గ్రామాల్లో పూర్తిస్తాయిలో శానిటేషన్ చేస్తున్నారు.

    Also Read: ఏపీలో మద్యం విక్రయాలపై పిటిషన్..!

    మరోవంక, గ్యాస్ లీక్ ఘటనలో కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ సోమవారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సహాయక చర్యలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణతో పాటు, పలువురు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా గ్యాస్‌లీక్‌ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటికే కోటి రూపాయల చొప్పున పరిహారం పంపిణీ ప్రారంభమైనట్లు మంత్రులు తెలిపారు. గ్యాస్‌ ప్రభావంతో అస్వస్థులైన వారికిచ్చే పరిహారంతో పాటు, బాధితులైన 5 గ్రామాల వారికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు.

    మూడు రోజుల్లోగా ప్రతి కుటుంబంలోని మహిళ ఖాతాలో మొత్తం జమ చేయాలని…చిన్న పిల్లలతో సహా, ప్రతి ఒక్కరికి రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆపై ఇంటింటికి వెళ్లే గ్రామ వలంటీర్లు బ్యాంకుల స్లిప్‌లు అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు.