జగన్, అమిత్ షా భేటీకి అంతరార్థమేమిటి?

ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళితే ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకుంటారు. కాదంటే ఆర్థిక మంత్రి అనుమతి అడుగుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు వీరిని కాదని హోం మంత్రితోనే భేటీ అవుతున్నారు. దీంతో ప్రతిపక్ష నేతల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాటిమాటికి ఢిల్లీ వెళ్లి హోం మంత్రితో సమావేశాలేంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని తరువాత హోం మంత్రిదే అధికారమైనా ఊరికే సమావేశాలు నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్, అమిత్ షా […]

Written By: Srinivas, Updated On : June 13, 2021 3:20 pm
Follow us on

ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళితే ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకుంటారు. కాదంటే ఆర్థిక మంత్రి అనుమతి అడుగుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు వీరిని కాదని హోం మంత్రితోనే భేటీ అవుతున్నారు. దీంతో ప్రతిపక్ష నేతల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాటిమాటికి ఢిల్లీ వెళ్లి హోం మంత్రితో సమావేశాలేంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని తరువాత హోం మంత్రిదే అధికారమైనా ఊరికే సమావేశాలు నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్, అమిత్ షా భేటీలకు మరో ప్రత్యేకత ఉంది. వారు ఎప్పుడు మీటింగ్ అయినా గంటల తరబడి గడుపుతున్నారు. రాత్రి తొమ్మిది తరువాత ఈ భేటీలు కొనసాగుతున్నాయి. దీంతో జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ సహా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. హోం మంత్రితో అన్నేసి గంటలపాటు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటని టీడీపీ నేతలు దీర్ఘాలు తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు నిధుల కొరత ఉన్నా ఆర్థిక మంత్రిని అసలు కలవడం లేదని గుర్తు చేస్తున్నారు.

జగన్ రెండేళ్లలో పదకొండు సార్లు ఢిల్లీ వెళ్లినా మొదట్లో అందరిలాగే జగన్ కూడా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ అడిగేవారు. తరువాత మాత్రం అమిత్ షాతోనే అపాయింట్ మెంట్ దొరికితేనే ఢిల్లీ వెళ్తున్నారు. మోడీ కంటే అమిత్ షా అంత ఇష్టంగా కనిపిస్తున్నారా అన్నది ప్రశ్న. మోడీని కలిసినా అమిత్ షానే కలవమని చెబుతారు అందుకే జగన్ ఆయన్ను కలుస్తున్నారని తెలుస్తోంది. పార్టీలోను కేంద్రంలోను అమిత్ షానే చక్రం తిప్పుతున్నందున ఆయన్ను కలుస్తున్నారని వై
సీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అమిత్ షా కూడా జగన్ ను కలవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ బలవంతుడిగా ఉన్నందున ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 2024లో కూడా మరోమారు ఆయనే గెలుస్తారని లెక్కలు కూడా చెబుతున్నాయి. మోడీ తరువాత ప్రధాని కావాలని కలలు కంటున్న అమిత్ షా కలయిక విషయంలో ఇద్దరిలో ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. దీంతో రాష్ర్ట ప్రయోజనాల కోసమే కాకుండా సొంత పనుల కోసమే అమిత్ షాను కలుస్తున్నారని పలువురు చెబుతున్నారు.