Homeఆంధ్రప్రదేశ్‌అమరరాజాను మూసేయాల్సిందే.. సజ్జల రామకృష్ణారెడ్డి

అమరరాజాను మూసేయాల్సిందే.. సజ్జల రామకృష్ణారెడ్డి

Amararaja should be closedప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే పరిశ్రమను రాష్ర్టం దాటి వెళ్లిపోవాల్సిందిగా వైసీపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. టీడీపీ నేత గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థను మూసేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యం వల్ల ప్రజల ప్రాణాలకు కష్టంగా ఉందని పేర్కొంది. దీనిపై హైకోర్టు కూడా వెళ్లిపోవాలని సూచించిందని చెప్పింది. దీంతో అమరరాజా బ్యాటరీస్ సంస్థ రాష్ర్టం నుంచి వెళ్లిపోవడం లేదని తామే బయటకు పంపుతున్నట్లు తెలిపింది. ప్రజలకు ఇబ్బందిగా ఉంటే దేన్ని అయినా తొలగించాల్సిందేనని చెప్పింది. దీంతో అమరరాజా సంస్థ మనుగడ కష్టంగా మారింది.

ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా చూసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. విరుద్ధంగా పరిశ్రమలు నడుపుతున్న వాటిని మూసేయాలని సూచించింది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మనుషుల ప్రాణాలకే విలువ ఇవ్వాలని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. తమకు అమరరాజా పై కోపం లేదని ప్రజల ప్రాణాలు హరించే పరిస్థితి వచ్చినందుకే సంస్థను రాష్ట్రం బయటికి పంపుతున్నట్లు పేర్కొన్నారు.

అమరరాజా బ్యాటరీస్ సంస్థలో 55 మందికి పరీక్షలు చేయగా 41 మంది శరీరాల్లో సీసం ఉన్నట్లు గుర్తించారు. అమరరాజాయే కాదు వైవీ సుబ్బారెడ్డి సంస్థ ఉన్నాప్రభుత్వం అలాగే వ్యవహరిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. గల్లా రామచంద్రనాయుడు, గల్లా జయదేవ్ టీడీపీ వారని, అమరరాజా సంస్థలో అక్రమాలు, తప్పులున్నా ప్రభుత్వం ప్రశ్నించవద్దా అని సజ్జల అడుగుతున్నారు. కాలుష్యంపై పీసీబీ, హైకోర్టు నిర్ధారించినందు వల్లే తాము చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

అమరరాజా బ్యాటరీస్ సంస్థ మనుగడపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అది మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే పరిశ్రమలను ఉపేక్షించేది లేదని వైసీపీ నేతుల చెబుతున్నారు. దీంతో కాలుష్య కారక సంస్థలు ఉండవద్దనే ఉధ్దేశంతోనే అమరరాజా సంస్థను తొలగించడం సముచితమే అనే సమాధానాలు వస్తున్నాయి. దీంతో ఏపీలో కాలుష్య కారక సంస్థల మనుగడపై అప్పుడే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...
ABN Radhakrishna

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...
Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
today horoscope

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
July 2026 Horoscope

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
Oktelugu Epaper