
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,442 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,412 మంది కోలుకున్నారు. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 19,73,996కు పెరిగాయి. ఈరోజు 19,40,368 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 13,444కు చేరాయి.