War 2: ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా వార్ 2.. ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఎన్టీయార్ రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో త్రిబుల్ ఆర్ సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇండియా వైడ్ గా మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి…అయితే ఈ సినిమాకి హాలీవుడ్ టచ్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక హాలీవుడ్ లో చాలా ఫేమస్ స్టంట్ మాస్టర్ అయిన ‘రజాటోస్ ‘ డిజైన్ చేశారట… ఇక కెప్టెన్ అమెరికా, ది సివిల్ వార్, ది ఫస్ట్ సోల్జర్, ఫాస్ట్ ఎక్స్ వంటి హాలీవుడ్ సినిమాలకి స్టంట్ కొరియోగ్రఫీ చేసి తనదైన రీతిలో మంచి గుర్తింపు అనేది సంపాదించుకున్నాడు.
అయితే సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీయార్ మధ్య జరిగే కొన్ని కీలక ఎపిసోడ్స్ ని కూడా తను డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ వార్త బాలీవుడ్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొడుతుంది. ఇక ఆయన డిజైన్ చేసిన స్టంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియాలంటే ఈ సినిమా వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ కనక బాగున్నట్టయితే ఇక మీదట నుంచి మన వాళ్ళు చేసే అన్ని సినిమాలకి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చూడాలి మరి ఈ సినిమాలో ఆయన కొరియోగ్రఫి చేసిన స్టంట్స్ ఏవిధంగా ఉన్నాయనేది…