Rajamouli: తెలుగులో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికి ఒక సినిమా ఎలా తీస్తే సూపర్ సక్సెస్ అవుతుందని తెలుసుకున్న ఏకైక దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇక బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియా లో తన సత్తా చాటుకున్న రాజమౌళి..
ఇప్పుడు మహేష్ బాబు తో చేయబోయే సినిమాతో వరల్డ్ సినిమాలో కూడా సందడి చేయబోతున్నాడు. కాబట్టి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 వేల కోట్ల వరకు వసూళ్లను రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కోసం రాజమౌళి తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా ఎక్కడ తగ్గకుండా తీర్చిదిద్దాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి డెడికేషన్ ని ఆయన సినిమా పట్ల తీసుకునే కేర్ ని చూసిన ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అయిన “మార్వెల్ స్టూడియోస్” వాళ్ళు రాజమౌళి తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట.
ఇక దాంట్లో భాగంగానే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘మహాభారతాన్ని’ తెరకెక్కిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యం లో మార్వెల్ స్టూడియోస్ లోని కొంతమంది రాజమౌళి తో టచ్ లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మరి రాజమౌళి కూడా వాళ్ళతో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.మరి ఈయన ఒకవేళ వాళ్లతో కనక సినిమా చేసినట్లయితే హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థతో సినిమా చేసిన మొట్టమొదటి తెలుగు డైరెక్టర్ గా కూడా రాజమౌళి సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తాడు. మన ఇండియన్స్ అత్యంత గొప్ప గా భావించే ‘మహాభారతాన్ని’ కూడా మనం భారీ రేంజ్ లో చూడబోతున్నామనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది.
ఇక తొందర్లోనే ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమా మీద ఉన్నాడు. తర్వాత చేయబోయే సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వడం లేదట. ఇక తొందరలోనే మార్వెల్ వాళ్ళతో రాజమౌళి చేయడం పక్కా అన్నట్టుగా హాలివుడ్ మీడియాలో కూడా కథనాలైతే వస్తున్నాయి…ఇక చూడాలి మరి వీళ్ళ కాంబో లో సినిమా వస్తుందా లేదా అనేది….