Walking: మానవ ఆరోగ్యంలో భాగంగా ప్రతిరోజు సరైన ఆహారం తీసుకోవడంతోపాటు.. సరైన వ్యాయామం చేయడం కూడా నేటి కాలంలో తప్పనిసరిగా మారింది. ప్రతిరోజు ప్రతి ఒక్కరు వ్యాయామం చేస్తేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకప్పటి కంటే ఇప్పుడు ఎక్కువమంది శ్రమలేకుండా పనులు చేస్తున్నారు. దీంతో శరీరంలో రక్తప్రసరణ తక్కువగా ఉండి అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. అయితే కొంతమంది తప్పనిసరిగా ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నారు. కానీ సాదాసీదాగా నడవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నడకలో కొన్ని సరైన పద్ధతులు వాడడం వల్ల అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లోనే బరువు తగ్గడంతో పాటు యాక్టివ్ అవుతారని పేర్కొంటున్నారు. అసలు నడకలో ఎలాంటి పద్ధతులు అవలంబించాలి?
కొందరు ప్రతిరోజు 100 లేదా 200 అడుగులు వేసి ఆ తర్వాత అలసిపోయి కూర్చుంటారు. ప్రపంచ ఆరోగ్య నివేదిక ప్రకారం 31 శాతం మంది శారీరక శ్రమ చేయడం లేదు. ఇలాంటి వారికి ఈ వాకింగ్ ఏమాత్రం సరిపోదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంటే వాకింగ్ చేసేటప్పుడు సాధారణంగా కాకుండా విభిన్న పద్ధతిలో ముందుకు నడవాలని అంటున్నారు. అంతేకాకుండా వాకింగ్ చేయాలని అనుకునేవారు 8 అడుగులు తప్పనిసరిగా వేయాలని కొందరు పేర్కొంటున్నారు. 8 అడుగులు వేసిన వారి ఆరోగ్యం సాధారణంగా ఉంటుందని.. అంతకంటే తక్కువగా నడిచిన వారిలో నిద్రలేమి సమస్యలు, గుండె జబ్బులు రావడానికి కారణాలు ఉంటాయి.
ఇందులో భాగంగా యూకే లోని బయోబ్యాంక్ ఓ పరిశోధన చేసింది. 33,560 మందిని పరిశీలించగా వీరిలో ఐదు నిమిషాల కన్నా తక్కువసేపు నడిచినవారు.. ఐదు నుంచి పది నిమిషాలు నడిచినవారు.. పది నుంచి 15 నిమిషాల పాటు నడిచినవారు.. 15 నిమిషాలు అంతకంటే ఎక్కువ నడిచినవారు.. ఇలా నాలుగు బృందాలుగా విభజించి వారి సగటు ఆరోగ్యాన్ని లెక్కించారు. ఐదు నిమిషాల పాటు నడిచిన వారిలో అన్ని రకాల మరణాలు 4.36% ఉన్నాయి. 15 నిమిషాలు నడిచిన వారిలో మరణాల ముప్పు 0.8% మాత్రమే ఉంది. తక్కువసేపు నడిచిన వారిలో 13 శాతం గుండె సంబంధిత వ్యాధుల బారిన పడ్డవారు ఉన్నారు. ఎక్కువసేపు నడిచిన వారిలో ఈ ప్రభావం తక్కువగా ఉంది.
అంటే వాకింగ్ చేసేవారు సమయం నిర్ణయించుకోకుండా తక్కువ సమయంలో ఎక్కువగా నడవడం లేదా స్పీడ్ గా నడవడం వల్ల కూడా 8 అడుగులు పూర్తయి అవకాశం ఉంటుంది. అయితే కొందరు ఉద్యోగ లేదా వ్యాపార కారణంగా సమయం ఉండదు. ఇలాంటివారు స్పీడుగా నడవడం వల్ల ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ గా నడవడంతో శరీరం ఎక్కువగా శ్రమించి రక్తప్రసరణను వేగం చేస్తుంది. దీంతో రోజంతా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే కేవలం నడవడం మాత్రమే కాకుండా సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. శారీరక శ్రమ చేయనివారు ఎక్కువగా వాకింగ్ చేయకపోతే వారిలో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందువల్ల ప్రతిరోజు వాకింగ్ చేయడం తప్పనిసరిగా చేసుకోవాలని ఆరోగ్యాన్ని నిపుణులు తెలుపుతున్నారు.