Genelia: బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించి.. హాసినిగా అందరి హృదయాల్లో నిలిచిపోయింది జెనిలియా. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు నటించి.. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్తో ప్రేమలో పడి.. వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా స్వస్థి చెప్పి.. ఇంటికే పరిమితమైంది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు. జెనిలియా సినిమాలకు దూరమైనప్పటికీ.. తన వ్యక్తిగత జీవితం, కుటుంబానికి సంబంధించిన విషయాలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.
https://www.instagram.com/p/CWr6Ak2oOVU/?utm_source=ig_web_copy_link
తాజాగా తన పెద్ద కుమారుడు రియాన్ పుట్టినరోజు సందర్భంగా.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది జెనిలియా. ప్రియమైన రియాన్.. ఇంత చిన్ని బుర్రలో ఎన్నో కోరికలు, ఆశలు ఉన్నాయి.. వాటన్నింటినీ నేను దగ్గరుండి నెరవేరుస్తానని ఇప్పుడు నీకు మాటిస్తున్నా.. నువ్వు ఎగరానుకున్నప్పుడు.. ఆ రెక్కను కాలేకపోయినా.. వాటికింద గాలినై నీకు అండగా ఉంటా.. రాసుకొచ్చింది.
Also Read: బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఇందులో నిజమెంత?
ప్రతి విషయంలో నువ్వు టాప్‌లో ఉండాలని అనుకోవట్లేదు.. నువ్వు ఎలా ఉన్నా నీ స్టైల్ నీకు ఉంటుంది. అదే నాకు కావాలి. ఎప్పుడూ నీకు తోడుగా ఉంటూ.. నిన్ను కాపాడుకుంటా.. అని ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేసింది జెనిలియా. ఈ క్రమంలోనే తన కుమారుడితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఈ సినిమాకు అనసూయ అందం, నటనే ఆకర్షణ- ఫ్లాష్‌బ్యాక్ టీమ్
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Heroin genelia emotional post about her son
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com