Saif Ali Khan: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సైఫ్ అలి ఖాన్…ఇక ఈయన గత కొన్ని రోజుల నుంచి ఇతర హీరోల సినిమాల్లో విలన్ గా నటిస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఎన్టీయార్ హీరోగా వచ్చిన దేవర సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఏది ఏమైనా కూడా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటు ముందుకు సాగుతుండటం విశేషం…ఇక ఈయన మీద గత రాత్రి రెండు గంటలకు ఆరుసార్లు కత్తి పొట్లతో దుండగుడుదాడి చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నప్పటికి కొన్ని మేజర్ సర్జరీస్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ బులిటన్ ను విడుదల చేస్తున్న డాక్టర్లు ప్రస్తుతానికైతే ఆయనకు పెద్దగా ప్రాణానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదని తేల్చి చెప్పేశారు. ఇక మెడ దగ్గర కొంచెం సీరియస్ గా ఇంజురీ అవ్వడంతో అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది అంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఒక హీరో మీద గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడం అనేది ఇప్పుడు సంచలనాన్ని రేకెత్తిస్తుంది.
మరి ఇదిలా ఉంటే రాత్రి రెండు గంటల సమయంలో ఆయన మీద దాడి జరిగినప్పుడు తన పెద్ద కొడుకు అయిన ఇబ్రహీం సైఫ్ అలీ ఖాన్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి ఆ సమయంలో కారు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆటో సహాయంతో అతన్ని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘లీలావతి ఆసుపత్రి’ కి తీసుకెళ్లి జాయిన్ చేశాడు. వెంటనే హాస్పిటల్ సిబ్బంది తేరుకొని ట్రీట్మెంట్ ని అందించడం స్టార్ట్ చేశారు.
మరి ఏది ఏమైనా కూడా వేల కోట్లకి అధిపతి అయిన సైఫ్ ఆలీ ఖాన్ ఇలా ఆపద సమయంలో ఉన్నప్పుడు కనీసం కారు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆటోలో హాస్పిటల్ కి వెళ్లడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…
మనకి ఎంత ఉంది అనే దానికంటే అవసరానికి ఏది ఉపయోగపడింది అనే దానికే ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంటుంది. మరి ఏది ఏమైనా కూడా తొందర్లోనే సైఫ్ ఆలీ ఖాన్ తొందరగా కోలుకొని మళ్ళీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం…