Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పేరుకి ఉప ముఖ్యమంత్రి కానీ, ఆయన పని తీరు ముఖ్యమంత్రి స్థాయిని తలపిస్తుందని దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు నార్త్ ఇండియా లో కూడా గత ఏడాది నుండి ఆయన పేరు ఏ రేంజ్ లో మారుమోగిపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి నుండి ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా మన తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్, రాకీయాల్లో విజయం సాధించిన తర్వాత తిరుగులేని సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఆయన తదుపరి చిత్రాలు ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదంతా పక్కన పెడితే సంక్రాంతి సంబరాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మేనియా నే కనిపించింది.
సోషల్ మీడియా లో అభిమానులు ఉభయగోదావరి జిల్లాలలో సంక్రాంతి సమయంలో జరిగే ప్రభల సంబరాల్లో పవన్ కళ్యాణ్ ఫొటోలతో హోరెత్తించారు. ఎక్కడ చూసిన ఆయనకీ సంబంధించిన ఫ్లెక్సీలు, ప్రభలు, కటౌట్లు విరిశాయి. వీటిని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఇది కోనసీమ కాదు, కళ్యాణ్ సీమ అంటూ పోస్టులు వేశారు. కోనసీమ లో పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు మేనియా ఎక్కువగా కనిపించింది. మిగిలిన హీరోల ప్రభావం అంతగా లేకపోవడం గమనార్హం. అదే విధంగా ప్రతీ సంక్రాంతికి చిత్తూరు జిల్లాల్లో జల్లికట్టు సంబరాలు కనీవినీ ఎరుగని రీతిలో చేస్తారు. ఈ సంబరాల్లో కూడా పవన్ కళ్యాణ్ మేనియా నే కనిపించింది. అభిమానులు ఆయన ఫోటోలు పట్టుకొని ఊరేగింపు చేయడం, వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడం వంటివి జరిగాయి. చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, వై ఎస్ జగన్ మేనియా కూడా కనిపించింది.
ఇలా ఒక పక్క కోనసీమ, మరోపక్క రాయలసీమ ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ మేనియా నే కనిపించడంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. సీమ ఏదైనా మా కళ్యాణ్ బాబు రారాజే అంటూ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ చివరి దశలో ఉంది. గత రెండు రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో బాబీ డియోల్ మీద పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇక కేవలం నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ నెలలోనే అది కూడా పూర్తి చేసి మార్చి 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం ఈ సినిమాలోని ‘మాట వినాలి’ పాట విడుదల కానుంది.