Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అభిమానుల అంచనాలకు ఈ చిత్రం ఏ మాత్రం లేకపోవడం తో అవుట్ రైట్ గా రిజెక్ట్ చేసారు. రామ్ చరణ్ లాంటి ఊర మాస్ హీరో ని సినిమాలో పెట్టుకొని ఒక్కటంటే ఒక్క ఫైట్ సన్నివేశాన్ని కూడా సరిగా తీయలేదని, ఎలివేషన్ సన్నివేశాలు లేవని, కథలో అసలు ఎక్కడా కూడా లాజిక్స్ లేవని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు పెదవి విరిచారు. సినిమాకి వెన్నుముక లాగా నిల్చిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాన్ని ఎవరో వెనుక నుండి తరుముతున్నట్టు చాలా తొందరగా ముగించేశారని, ఆ ఫ్లాష్ బ్యాక్ ని ఇంకా కాస్త పొడిగించి అనవసరమైన సన్నివేశాలను తొలగించి ఉండుంటే ఈరోజు ‘గేమ్ చేంజర్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ప్రభంజనం లాగా నిలిచేదని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
మొదటి వారం తెలుగు వెర్షన్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 85 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. కానీ హిందీ వెర్షన్ లో మాత్రం మొదటి వారం పర్వాలేదు అనే రేంజ్ ట్రెండ్ ని చూపించింది. మొదటి రోజు 8 కోట్ల 64 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు 8 కోట్ల 43 లక్షలు, మూడవ రోజు 9 కోట్ల 52 లక్షలు, నాల్గవ రోజు 2 కోట్ల 42 లక్షల రూపాయిలను రాబట్టి మొదటి నాలుగు రోజులకు 29 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత మిగిలిన నాలుగు రోజులకు కలిపి ఈ సినిమాకి 9 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 38 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి 50 కోట్ల రూపాయిల గ్రాస్ హిందీ వెర్షన్ లో వచ్చాయి.
షేర్ లెక్కల్లో చూస్తే హిందీ వెర్షన్ మొత్తం కలిపి 17 నుండి 19 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఇంకా ఈ చిత్రం హిందీ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టాలి. అంటే దాదాపుగా ఇంకో 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి అన్నమాట. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే అది అసాధ్యం అని చెప్పొచ్చు. కానీ ఈ వీకెండ్ ఈ చిత్రానికి అత్యంత కీలకంగా మారబోతుంది. ఈ వీకెండ్ లో మరో పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టగలిగితే, ఫుల్ రన్ లో జరగబోయే నష్టం కాస్త తగ్గుతుంది. మరి ఈ వీకెండ్ ఈ చిత్రానికి కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి.