Pattudala Trailer: ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కావాల్సిన తమిళ హీరో అజిత్ ‘విడాముయార్చి’ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అజిత్ అభిమానులు ఈ చిత్రాన్ని వాయిదా వేయడం పై చాలా తీవ్ర స్థాయిలో అసంతృప్తి ని వ్యక్తం చేసారు. కొంతమంది అయితే ఫ్యానిజం ని వదిలేస్తున్నట్టు ట్వీట్లు కూడా వేశారు. ఈ సినిమాని వాయిదా వేయడం పట్ల వారిలో ఆ రేంజ్ అసంతృప్తి వ్యక్తమైంది. ఈ చిత్రాన్ని జనవరి 24 లేదా ఫిబ్రవరి 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసారు. తెలుగు లో ఈ చిత్రానికి ‘పట్టుదల’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ ట్రైలర్ కి మన ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈమధ్య కాలం లో కొన్ని తమిళ సినిమాలు నేరుగా తమిళ టైటిల్స్ తోనే తెలుగు లో కూడా విడుదల అవ్వడం మనం చాలానే చూసాము. అందులో తమిళ సూపర్ స్టార్, మన తెలుగు ఆడియన్స్ ఎంతో ఇష్టపడే రజినీకాంత్ కూడా ఉండడం విశేషం. గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘వెట్టియాన్’ చిత్రం, అదే టైటిల్ తో తెలుగు లో కూడా విడుదలైంది. ఈ సినిమా తర్వాత సూర్య కంగువ కూడా అదే టైటిల్ తో వచ్చింది. దీనిపై మన ఆడియన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి ట్రెండ్ నటిస్తున్న ఈ కాలం లో అజిత్ తన సినిమాకి తెలుగు టైటిల్ పెట్టడం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక ఈ థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తున్నంత సేపు మనం సౌత్ సినిమాని చూస్తున్నామా?, లేదా హాలీవుడ్ సినిమాని చూస్తున్నామా? అనే అనుమానం కలుగుతుంది.
ఆ రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ మాగిజ్ తిరుమేని తెరకెక్కించాడు. ఇందులో అజిత్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారక్టర్ కోసం ఆయన చాలా సన్నబడ్డాడు. ఇందులో హీరోయిన్ గా త్రిష నటించగా, విలన్స్ గా అర్జున్, రెజీనా కాసాండ్రా నటించారు. హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘బ్రేక్ డౌన్’ అనే సినిమాని ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో అజిత్ తన భార్య తో కలిసి రైడింగ్ కి వెళ్తున్న సమయం లో యాక్సిడెంట్ కి గురి అవుతాడు. తాను కోమాలోకి వెళ్లగా, భార్య ఏమైందో తెలియదు. బ్రతికే ఉంది అనే విషయాన్ని తెలుసుకున్న హీరో ఆమె కోసం వెతుకులాడుతాడు. ఈ మధ్యలో నడిచే స్క్రీన్ ప్లే మొత్తం చాలా థ్రిల్లింగ్ అంశాలతో నిండిపోయి ఉంటుంది. ప్రేక్షకులను ఇది ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.