Sleeping Tips: ప్రస్తుత కాలంలో నిద్ర పట్టడం అంటే పెద్ద టాస్క్. పడుకోగానే నిద్ర పట్టాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి అని చమత్కారం చేస్తుంటారు. మరి మీకు నిద్ర పడుతుందా? చేతిలో ఫోన్ అందులో వాట్సప్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లు అదేనండి టోటల్ గా సోషల్ మీడియా ఉంటే ఇక నిద్ర వస్తుందా? రావడం సాధ్యమా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ కు అడెక్ట్ అవుతున్నారు. ఫోన్ లేకపోతే జీవితం లేదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అందుకే నిద్రకు కూడా దూరం అవుతున్నారు కొందరు.
సుఖ నిద్ర పోవాలంటే ఏం చేయాలి? ఇంతకీ సుఖ నిద్ర అంటే ఏమిటి అనుకుంటున్నారా? బెడ్ మీదకు వెళ్లగానే పదినిమిషాల్లో నిద్ర వస్తే పోతే చాలు సుఖ నిద్ర పోయినట్టే. కానీ ఈ నిద్ర చాలా మందికి కరువు అయింది. రాత్రి వరకు ఉద్యోగాలు. కాస్త త్వరగా వచ్చినా ఫోన్ లు లేదా ఫోనే జీవితం అన్నట్టు ప్రవర్తించడంతో ఈ సుఖ నిద్రను కోల్పోతున్నారు చాలామంది. అయితే నిద్ర పోవాలి అని ఎంత ప్రయత్నించినా కూడా కొందరికి నిద్ర రాదు. మరి నిద్ర రావాలి అంటే ఏం చేయాలి..
మీరు సుఖ నిద్ర పోవాలి అంటే కేవలం పుస్తకం పట్టుకోండి చాలు. వద్దన్నా నిద్ర వస్తుంది. ఎక్కడికో పారిపోయిన నిద్ర పరిగెత్తుకుంటూ వచ్చేస్తోంది. అందుకోసం పుస్తకం పట్టుకొని రెండు పేజీలు తిప్పండి వెంటనే నిద్రలోకి జారుకుంటారు. మరో గమ్మత్తు విషయం ఏంటంటే.. చాటింగ్ చేస్తే రానీ నిద్ర, ఫేస్ బుక్ చూస్తే రానీ నిద్ర పుస్తకం పట్టుకోగానే వస్తుంది. నిద్ర రావాలంటే మరో పని కూడా చేయవచ్చు. అదేనండి జపం చేస్తే చాలట రెండే రెండు నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంటుందట.