Joint problems : వయస్సు పెరగడం, జీవనశైలిలో మార్పులు వల్ల చాలా మంది ఈ రోజుల్లో కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయస్సు పెరిగిన తర్వాత అనారోగ్య సమస్యలు రావడమనేది సాధారణమే. కానీ పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈ రోజుల్లో చాలామంది కీళ్ల సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి అయిన విముక్తి చెందాలంటే ముఖ్యంగా చేయాల్సింది ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాడీకి ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు తీసుకోకపోవడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కీళ్ల సమస్యలకు జాగ్రత్త వహించకపోతే ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధులు బారిన పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కొందరు యంగ్ ఏజ్‌లోనే కీళ్ల సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య వస్తే నడవడం, ఎక్కువ సమయం కూర్చోలేకపోవడం, తమ పనులు చేసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం వంటివి చేయాలి. అయితే కీళ్ల సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చో తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు పోషకాలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, గుడ్లు, చేపలు తీసుకోవాలి. వారినికొకసారి అయిన చేపలను తినడం అలవాటు చేసుకోవాలి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల సమస్యలను తగ్గించడంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. డైలీ వ్యాయామం చేయడం, వాకింగ్, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. కీళ్ల సమస్యలు ఉన్నవారు చిప్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్, నూడిల్స్, పోషకాలు లేనివి ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా ప్లాస్టిక్‌లో ఉన్న పదార్థాలను అసలు తినకూడదు. ఆర్టిఫిషియల్ స్విటెనర్ కూడా తినకూడదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు కీళ్ల సమస్యలు కూడా పెరుగుతాయి.
కీళ్ల సమస్యలు ఉన్నవారు డాక్టర్ పరివేక్షణలో మందులు వాడటంతో పాటు సహజంగా కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఇంట్లోనే పోషకాలు ఉండే ఆహారం తీసుకుంటూ శారీరక శ్రమపై కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. బరువు ఎక్కువగా ఉంటే కీళ్ల సమస్యలు ఉన్నవారు కాస్త తగ్గడానికి ప్రయత్నించాలి. ఈ కీళ్ల సమస్యలు ఉంటే కొందరికి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. దీంతో మానసికంగా కూడా ఇబ్బంది పడుతుంటారు. శరీరానికి సరిపడా నిద్రపోవాలి. ఎక్కడైతే కీళ్ల నొప్పులు ఉంటాయో అక్కడ హీటింగ్ ప్యాడ్‌ను పెట్టాలి. వేడి తగలడం వల్ల కీళ్ల నొప్పులు సమస్యలు తొందరగా తగ్గుతాయి. కూర్చోని యోగా, మెడిటేషన్ చేయాలి. ఇలాంటి నియమాలు పాటిస్తే కీళ్ల సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు. లేకపోతే నొప్పి అధికమయ్యే ప్రమాదం ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.