Homeక్రీడలుక్రికెట్‌Agata Isa Bella Centasso : కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన లేడీ ఫుట్ బాలర్.....

Agata Isa Bella Centasso : కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన లేడీ ఫుట్ బాలర్.. రెచ్చిపోయిన ఫ్యాన్స్.. బాబోయ్ మీరు ఎవర్నీ వదలరేంట్రా!..

Agata Isa Bella Centasso : విరాట్ కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూనే.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నారు. అతనితో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు నాటి జ్ఞాపకాలను.. పరోక్షంగా సంబంధం ఉన్నవారు అతనితో ఉన్న తీపి గుర్తులను మననం చేసుకుంటున్నారు. విరాట్ జన్మదిన నేపథ్యంలో ఇటలీ మహిళా ఫుట్ బాలర్ అగటా ఇసా బెల్లా సెంటాస్సో ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది.. ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తూ విరాట్ కోహ్లీని ట్యాగ్ చేసింది..” జన్మదిన శుభాకాంక్షలు విరాట్ కోహ్లీ.. నీకు అంత మంచే జరగాలి.. ఇట్లు ఇటలీ నుంచి నీ అభిమాని” అంటూ ఆమె ట్వీట్ చేసింది. దానికి తాను టీమిండియా జెర్సీ ధరించి దిగిన ఫోటోను యాడ్ చేసింది. ఈ ట్విట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె చేసిన ట్వీట్ పట్ల భారతీయ అభిమానులు నొచ్చుకున్నారు. వారిలో అసలైన కోణాన్ని ఆమెకు రుచి చూపించడం మొదలుపెట్టారు..” నీకు విరాట్ కోహ్లీ తెలియదు. క్రికెట్ గురించి అంతకంటే తెలియదు. కేవలం పాపులారిటీ కోసమే ఈ ట్వీట్ చేశావు. దీనివల్ల నీకు లైకులు వస్తాయి. కామెంట్లు కూడా లభిస్తాయి. నీ వ్యవహారం చాలా బాగుంది” అంటూ విమర్శలు చేశారు. ఇంకా కొంతమంది అయితే చెప్పరాని తీరుగా దూషణలకు దిగారు. దీంతో ఇసబెల్లా స్పందించక తప్పలేదు..

నెగిటివిటీ ఎందుకు తీసుకొస్తారు?

విరాట్ కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ఇసబెల్లా.. తనను విమర్శిస్తున్న కొంతమంది నెటిజన్ల కు దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చింది. తనను అనవసరంగా తిడుతున్న వారికి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పింది..” ప్రతిసారి ఇదే జరుగుతోంది. విరాట్ కోహ్లీకి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలిపినప్పుడు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారు.. నిజంగా వారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. ఇందులో దాచుకోవడానికి ఏముంది. విరాట్ కోహ్లీ జన్మదినం సందర్భంగా నేను శుభాకాంక్షలు చెప్పాను. అతడి ఆటకు నేను అభిమానిని. అతడి ఆటను ఆస్వాదిస్తాను. అతడు ఆడుతుంటే చూస్తూ ఉండిపోతాను. శారీరక సామర్థ్య విషయంలో విరాట్ అద్భుతమైన ప్రమాణాలను నెలకొల్పాడు. అతడిని చూస్తూ వర్ధమాన క్రీడాకారిణిగా నేను కూడా అలాంటి ప్రమాణాలు పాటించాలని భావిస్తున్నాను. కానీ కొంతమంది దీనిని వ్యతిరేకంగా అర్థం చేసుకుంటున్నారు. వారందరికీ ఎలాంటి సమాధానాలు చెప్పాలో నాకు అసలు అర్థం కావడం లేదు. వారందరికీ ఒక నమస్తే” అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఉదయం నుంచి ప్రచారం

విరాట్ కోహ్లీ అంటే నచ్చని కొంతమంది ఇలాంటి విమర్శలకు దిగుతున్నారని జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ద్వారా తెలుస్తోంది. వారు విరాట్ అభిమానులను రెచ్చగొట్టే విధంగా chokli Black day అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. బెంగళూరు జట్టు ఇంతవరకు టైటిల్ గెలవలేదని హేళన చేస్తున్నారు. విరాట్ కు చీర కట్టిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇసాబెల్లా కు కోహ్లీ అభిమానులు అండగా నిలిచారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version