నేటి యువతలో చాలామంది నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యంగా లేకపోతే నిద్ర సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా నిద్రపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒత్తిడి, ఆర్థిక పరిస్థితులు, విపరీతమైన ఆలోచనలు కూడా నిద్రలేమి సమస్యకు కారణమవుతున్నాయి.
Also Read: పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
నిద్రలేమి సమస్యతో బాధ పడేవాళ్లు రోజూ పడుకునే ముందు పాలలో స్పూన్ తేనె వేసుకొని తాగాలి. పాలలో తేనె కలుపుకుని తాగడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పాలలో దాల్చిన పొడి కలిపి తాగినా నిద్రలేమి సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. రోజూ రాత్రి సమయంలో అరటిపండ్లు తిన్నా నిద్రలేమి సమస్య దూరమవుతుంది. సుఖనిద్రకు ఉపయోగపడే ఎన్నో పోషకాలు బీన్స్ లో ఉన్నాయి.
Also Read: సోంపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
బీన్స్ లో ఉండే బి విటమిన్ నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది. ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలను తీసుకున్నా నిద్రలేమికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఫ్యాట్‌లెస్ పెరుగును తీసుకున్నా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధ పడేవాళ్లు బఠానీలను డైట్ లో చేర్చుకున్నా ఆ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
ప్రతిరోజూ చేపలు తినడం ద్వారా కూడా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మెగ్నీషియం ఎక్కువగా ఉన్న బాదంను తీసుకున్నా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. నిద్రించడానికి ముందు చెర్రీలను నేరుగా తీసుకున్నా లేదా జ్యూస్ లా తాగినా సులభంగా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు.