మనకు సంవత్సరమంతా లభ్యమయ్యే ఆకు కూరల్లో పుదీనా కూడా ఒకటి. ప్రత్యేకమైన సువాసన కలిగిన పుదీనాను బిర్యానీ తయారీలో, గ్రీన్ చట్నీ తయారీలో ఉపయోగిస్తామనే సంగతి తెలిసిందే. అయితే పుదీనా వంటకు మంచి ఫ్లేవర్ ఇవ్వడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంలో సహాయపడుతుంది. పుదీనా ఏ, బీ విటమిన్లతో పాటు ఐరన్, పాస్పరస్, కొవ్వు పదార్థాలు, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను కలిగి ఉంటుంది.
Also Read: నిద్రలేమికి సులభంగా చెక్ పెట్టే చిట్కాలివే…?
చూయింగ్ గమ్స్, మౌత్ ఫ్రెషనర్స్, టూత్ పేస్ట్, గమ్, ఇన్ హేలర్ తయారీలో పుదీనాను ఎక్కువగా ఉపయోగిస్తారు. పుదీనా చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడంతో పాటు వేగంగా ఆహారం జీర్ణం కావడంలో సహాయపడుతుంది. పుదీనాలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. గర్భిణులు పుదీనాను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్, ఒమేగా త్రీలు లభిస్తాయి.
Also Read: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో కిలో చికెన్ ఎంతంటే..?
సీజనల్ గా వచ్చే అలర్జీలను తగ్గించడంలో పుదీనా సహాయపడుతుంది. పుదీనాలో ఉండే మెంతాల్ దగ్గు, జలుబు సమస్యలకు సులభంగా చెక్ పెడుతుంది. ప్రతిరోజూ పుదీనాను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతం కావడంతో పాటు జీర్ణసంబంధిత సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. గర్భిణీ స్త్రీలు పుదీనాను తీసుకోవడం వల్ల వికారం, అలర్జీ సమస్యలు దూరమవుతాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
కడుపునొప్పి, గ్యాస్, నులిపురుగుల సమస్యకు చెక్ పెట్టడంలో పుదీనా సహాయపడుతుంది. వేసవికాలంలో మజ్జిగలో పుదీనా రసం కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. పుదీనా ఆకుల వాసన చూసినా తలనొప్పి, తల తిరగడం లాంటి సమస్యలు దూరమవుతాయి.