https://oktelugu.com/

Star Director: ఆ బ్యానర్ ను నమ్ముకొని ఇబ్బందుల్లో పడ్డ స్టార్ డైరెక్టర్…

Star Director: జాతి రత్నాలు సినిమా ప్రమోషన్స్ టైం లో ఆయన క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొని యాంకర్ సుమ కే దిమ్మ తిరిగిపోయే పంచులు వేయడంతో ఆయనను క్యాష్ అనుదీప్ అని కూడా పిలుస్తూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 17, 2024 / 12:48 PM IST

    star director who got into trouble by believing in that banner

    Follow us on

    Star Director: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకి మంచి క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్స్ కి వాళ్ళు తీసిన సినిమాలతోనే కాకుండా ఆ దర్శకుడు అంటే కూడా చాలామందికి ఇష్టం ఏర్పడే విధంగా వాళ్ళ మాటలు గాని వాళ్ళ బిహేవియర్ ను గాని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే జాతి రత్నాలు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనుదీప్ కేవి.

    ఇక జాతి రత్నాలు సినిమా ప్రమోషన్స్ టైం లో ఆయన క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొని యాంకర్ సుమ కే దిమ్మ తిరిగిపోయే పంచులు వేయడంతో ఆయనను క్యాష్ అనుదీప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఆయన ఆటిట్యూడ్ తో గాని, ఆయన బిహేవియర్ తో గాని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. తను ఏదైనా ఫంక్షన్ లో కనిపిస్తే చాలు ఒక స్టార్ హీరో కి ఎలాంటి విజిల్స్ వేస్తూ అల్లరి చేస్తారో అనుదీప్ విషయంలో కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుదీప్ సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడు.

    Also Read: Trivikram: త్రివిక్రమ్ ఆ ఇద్దరు హీరోయిన్స్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాడా..?

    నిజానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఆయనకి అడ్వాన్స్ ఇచ్చి రవితేజతో సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ అనుకోని కారణాలవల్ల రవితేజ ఇంకొక సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. మరి అనుదీప్ మాత్రం ఖాళీగానే ఉంటున్నాడు. ఇక అనౌన్స్మెంట్ ఇచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఈ సినిమా మాత్రం పట్టాలెక్కకపోవడంతో అనుదీప్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక మరొక హీరోతో సినిమా చేద్దాం అంటే ఇప్పుడు ఏ హీరో కూడా ఖాళీగా లేరు.

    Also Read: Sai Dharam Tej: మామయ్య పవన్ కి సాయి ధరమ్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటీ? దాని విలువ ఎంతో తెలుసా?

    ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలు కమిటై ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అనుదీప్ ఏం చేయాలి అనే ఒక డైలామా లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే సితార ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు అనుదీప్ ను నమ్మించి మోసం చేస్తుంది అంటూ అనుదీప్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే సితార ఎంటర్టైన్మెంట్స్ రవితేజ ప్లేస్ లో మరొక హీరో ని తీసుకొచ్చి సినిమా చేస్తారా లేదా రవితేజ కోసం వెయిట్ చేస్తారా అనేది చూడాలి…