దేశంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రజల ఆలోచనా తీరు, జీవన విధానం మారుతున్నాయి. బ్లూటూత్ హెడ్ ఫోన్లకు దేశవ్యాప్తంగా రోజురోజుకు ఊహించని స్థాయిలో ఆదరణ పెరుగుతోంది. అయితే బ్లూటూత్ హెడ్ ఫోన్లను వినియోగించే వాళ్లకు అవి విడుదల చేసే రేడియేషన్ వల్ల ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ను ఎక్కువగా వినియోగిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
బ్లూటూత్ హెడ్ ఫోన్లు మెదడు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూఎస్ లోని కొలరోడా యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. ఇయర్ బడ్స్ నుంచి వెలువడే తరంగాల వల్ల మెదడు కణజాలం దెబ్బ తినే అవకాశాలు అయితే ఉంటాయి. ఇయర్ బడ్స్ జన్యుపరమైన రుగ్మతలతో పాటు న్యూరోలాజికల్ రుగ్మతలకు కారణమవుతుందని చెప్పవచ్చు.
వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ను ఎక్కువగా వినియోగిస్తే జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు, పుట్టిన పిల్లలకు వైర్ లెస్ హెడ్ ఫోన్లు ప్రమాదకరమని చెప్పవచ్చు. ఎటువంటి వైర్లు, కేబుల్స్ లేకుండానే బ్లూటూత్ హెడ్ ఫోన్ ఫోన్లు లేదా ఇతర పరికరాలకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్లూటూత్ హెడ్ ఫోన్ల వల్ల న్యూరోలాజికల్ వ్యాధులతో పాటు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
బ్లూటూత్ హెడ్ ఫోన్ల వల్ల చెవిపై చెడు ప్రభావం పడే అవకాశంతో పాటు వినికిడి లోపం, చెవి ఇన్ఫెక్షన్లు, టిన్నిటస్, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీటిని రోజులో గంట కంటే ఎక్కువ సమయం వినియోగించకుండా ఉండటం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.