https://oktelugu.com/

Sugercane Juice : వేసవిలో చెరకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..?

Sugercane Juice : మనలో చాలామంది చెరకు రసం తాగడాన్ని ఇష్టపడతారు. ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో చెరకు రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చెరకు రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. సంతానోత్పత్తికి చెరకు రసం బూస్టర్ లా పని చేస్తుంది. కొత్తగా పెళ్లైన దంపతులు చెరకు రసం తాగడం మంచిది. చెరకు రసం తల్లి అయిన మహిళల్లో పాల ఉత్పత్తిని అలాగే పురుషుల్లో […]

Written By: , Updated On : March 13, 2021 / 07:30 PM IST
Follow us on

Sugercane Juice : మనలో చాలామంది చెరకు రసం తాగడాన్ని ఇష్టపడతారు. ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో చెరకు రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చెరకు రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. సంతానోత్పత్తికి చెరకు రసం బూస్టర్ లా పని చేస్తుంది. కొత్తగా పెళ్లైన దంపతులు చెరకు రసం తాగడం మంచిది. చెరకు రసం తల్లి అయిన మహిళల్లో పాల ఉత్పత్తిని అలాగే పురుషుల్లో స్పెర్మ్ యొక్క నాణ్యతని మెరుగుపరుస్తుంది.

మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పికి చెక్ పెట్టడంలో చెరకు రసం సహాయపడుతుంది. పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు చెరకు రసం తాగితే మంచిది. వారంలో మూడు సార్లు చెరకు రసం తీసుకుంటే చెరకు రసం సహజ డిటాక్స్ గా ఉపయోగపడుతుంది. వేసవికాలంలో చాలామంది డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. చెరకు రసం డీ హైడ్రేషన్ సమస్యకు సులువుగా చెక్ పెడుతుంది.

చెరకు రసం శరీరంలో ఉబ్బరాన్ని, అలసటను తొలగించడంతో పాటు కిడ్నీలు సరిగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. చెరకు రసంలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండే చెరకు రసం ఇమ్యూనిటీ పవర్ ను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని రక్షించడంలో చెరకు రసం సహాయపడుతుంది. ఇందులో శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఐరన్, పొటాషియం ఉంటాయి. మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టడంలో చెరకు రసం సహాయపడుతుంది.