https://oktelugu.com/

డ్రగ్స్ కేసులో నోటీస్ పై స్పందించిన హీరో తనీష్

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యువ హీరోకు నోటీసులు అందాయన్న వార్త ఈరోజు సంచలనమైన సంగతి తెలిసిందే. బెంగళూరు పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారని.. విచారణకు పిలిచారని జోరుగా ప్రచారం సాగింది. ఈ కేసులో హీరో తనీష్ తోపాటు మరో ఐదుగురిని పోలీసులు శనివారం విచారణకు పిలిచారని వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై టాలీవుడ్ యువ హీరో, బిగ్ బాస్ ఫేం తనీష్ స్పందించాడు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశాడు. నిజానిజాలేమిటో తెలుసుకునేందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2021 / 07:43 PM IST
    Follow us on

    డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యువ హీరోకు నోటీసులు అందాయన్న వార్త ఈరోజు సంచలనమైన సంగతి తెలిసిందే. బెంగళూరు పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారని.. విచారణకు పిలిచారని జోరుగా ప్రచారం సాగింది. ఈ కేసులో హీరో తనీష్ తోపాటు మరో ఐదుగురిని పోలీసులు శనివారం విచారణకు పిలిచారని వార్తలు వెలువడ్డాయి.

    ఈ క్రమంలోనే ఈ వార్తలపై టాలీవుడ్ యువ హీరో, బిగ్ బాస్ ఫేం తనీష్ స్పందించాడు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశాడు. నిజానిజాలేమిటో తెలుసుకునేందుకు తనను కనీసం ఎవరూ సంప్రదించలేదని.. ఆ వార్తలన్నీ తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని తనీష్ వాపోయాడు.

    బెంగళూరుకు చెందిన నిర్మాతకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చిన మాట వాస్తవమేనని.. అయితే తనకు వచ్చిన నోటీసు అర్థమేమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మీడియా ప్రచారం చేయడం సరికాదని తనీష్ వాపోయాడు. తనకు వచ్చిన నోటీసులు ‘ఆ నిర్మాతకు గురించి మీకు వివరాలు తెలిస్తే చెప్పండి’ అని మాత్రమే అడిగేందుకు నోటీస్ ఇచ్చారని తనీష్ తెలిపాడు.

    దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు విన్నవించాడు. బెంగళూరుకు చెందిన ఆ నిర్మాత తనతో సినిమా చేస్తానని సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. కానీ ఆయనతో తనకు ఇప్పుడు ఎలాంటి సంబంధాలు లేవని తనీష్ క్లారిటీ ఇచ్చాడు.