https://oktelugu.com/

బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయ్యిందా.. ఎలా చెక్ చేయాలంటే..?

దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ స్కీమ్ కు అర్హత పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలన్న సంగతి తెలిసిందే. గతంలో ఆధార్ తప్పనిసరి కాదని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఏ పథకం అమలు చేయాలన్నా ఆధార్ తప్పనిసరి అని చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 31వ తేదీలోగా బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ ను బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసుకోవాలని సూచించారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 13, 2021 7:26 pm
    Follow us on

    దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ స్కీమ్ కు అర్హత పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలన్న సంగతి తెలిసిందే. గతంలో ఆధార్ తప్పనిసరి కాదని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఏ పథకం అమలు చేయాలన్నా ఆధార్ తప్పనిసరి అని చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 31వ తేదీలోగా బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ ను బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసుకోవాలని సూచించారు.

    ఈ నెల 31వ తేదీలోగా బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ ను లింక్ చేసుకోకపోతే బ్యాంక్ లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజల్లో చాలామంది బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ ను లింక్ చేసుకోగా లింక్ చేసుకోని వాళ్లు త్వరగా చేసుకుంటే మంచిది. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ నంబర్ లింక్ అయిందో లేదో కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది.

    https://resident.uidai.gov.in/bank-mapper వెబ్ సైట్ ద్వారా ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్‌ లింక్ అయ్యిందా? లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని సెక్యూరిటీ కోడ్ క్యాప్చాను ఎంటర్ చేసి ఆ తరువాత వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు సులభంగా తెలిసే అవకాశం ఉంటుంది.

    ఒకవేళ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ నంబర్ లింక్ కాపోతే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సులభంగా బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.