Drinking Water: నిలబడి నీరు తాగుతున్నారా? అయితే ఇది మీకోసమే..

పనిలో పడి కూర్చున్న దగ్గరనే నీరు తాగుతుంటారు. లేదంటే ఇంట్లో ఎవరైనా ఉంటే గ్లాసు నీళ్లు ఇస్తే పడుకొని తాగే వారు కూడా ఉంటారు. బద్దకంతో కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు.

Written By: Swathi Chilukuri, Updated On : March 2, 2024 2:26 pm
Follow us on

Drinking Water: నీరు.. శరీరంలో దీని పాత్ర చాలా ముఖ్యమైనది. ఒక పూట ఆహారం తీసుకోకున్నా పర్వాలేదు కానీ నీరు మాత్రం తీసుకోకుండా ఉండకూడదు అంటారు. నీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సీజన్ ఏదైనా సరే పిల్లల నుంచి పెద్దల వరకు కొంత పరిమాణంతో నీరు తాగాల్సిందే. కచ్చితంగా 6లీటర్ల నీరును తీసుకోవాలి అంటారు ఆరోగ్య నిపుణులు. అయితే కొందరు మాత్రం నీటిని పడుకొని, కూర్చొని, నిల్చుని కూడా తాగుతుంటారు ఇంతకీ ఇలా తాగవచ్చా లేదా అనేది తెలసుకుందాం.

పనిలో పడి కూర్చున్న దగ్గరనే నీరు తాగుతుంటారు. లేదంటే ఇంట్లో ఎవరైనా ఉంటే గ్లాసు నీళ్లు ఇస్తే పడుకొని తాగే వారు కూడా ఉంటారు. బద్దకంతో కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. కానీ పడుకొని నీటిని మాత్రం సేవించకూడదు. అయితే పడుకొని నీటిని మాత్రమే కాదు ఎలాంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు అంటారు నిపుణులు. మరి ఇంతకీ నిల్చొని నీరు తాగవచ్చా లేదా అనే సందేహాలు కూడా ఉంటాయి చాలా మందికి.. దీనిపై డాక్టర్. మనన్ వోరా క్లారిటీ ఇచ్చారు.

మనం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే రోజు తగినంత నీరు తాగాల్సిందే. అయితే నీరు నిలబడి తాగితే ప్రమాదం అంటారు కొందరు. కానీ ఇదంతా అపోహ అంటున్నారు మనన్. నిలబడి నీరు తాగితే కడుపు దిగువన ఒత్తిడి పెరుగుతుందని.. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను దెబ్బతీస్తుందని.. అజీర్ణానికి కారణం అవుతుంది అంటారు. కానీ అందులో నిజం లేదు అన్నారు డా. మనన్ వోరా. అయితే పడుకొని మాత్రం నీరును సేవించవద్దు అని క్లారిటీ ఇచ్చారు.