Jr NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఇండస్ట్రీలో తన హవని కొనసాగించాడు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్(Sr NTR) ఎలాంటి నటనను అయితే కనబరిచేవాడో, దానికి ఏ మాత్రం తగ్గకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాంటి నటనతోనే జనాలను మెప్పిస్తున్నాడు. ఇక ముఖ్యంగా ఆయన ఎంత పెద్ద డైలాగు అయిన కూడా సింగిల్ టేక్ లో చెప్పి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు కావడం విశేషం.
అలాగే డాన్స్ ని కూడా ప్రాక్టీస్ చేయకుండా, కొరియోగ్రాఫర్ ఎలాంటి స్టెప్ అయితే వేస్తాడో అలాంటి స్టెప్పుని ఒక్కసారి చూసి ఆజ్ ఇట్ ఇస్ గా వేస్తాడు. అయితే ఆయన ఇంత టాలెంట్ ని సంపాదించుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ల అమ్మ అయిన షాలినిని ఎన్టీయార్ ని ఇద్దరిని కూడా నందమూరి ఫ్యామిలీ వాళ్లలో కలుపుకునేది కాదు. అందుకే వీళ్ళు సపరేట్ గా బతికేవారు.
ఇక ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ షాలిని ఎలాగైనా ఎన్టీయార్ ను నందమూరి ఫ్యామిలీలో కలపాలని చెప్పి అతనికి చిన్నప్పటి నుంచే నటన పరంగా గాని, డ్యాన్స్ పరంగా గాని అన్నింటిలో శిక్షణ ను ఇప్పించింది. ఇక ముఖ్యంగా ఎన్టీఆర్ కూచిపూడి డ్యాన్స్ లో చాలా అద్భుతమైన ప్రావీణ్యాన్ని కనబరిచడమే కాకుండా చిన్నతనంలో చాలా స్టేజ్ షో లు కూడా ఇచ్చాడు. అందువల్లే తను డ్యాన్స్ మాస్టర్స్ చెప్పే స్టెప్ లను చాలా ఈజీగా వేసేస్తుంటాడు. ఇక నటన లో కూడా తనకి శిక్షణ ఇప్పించింది.
అందువల్లే తను చిన్నప్పటి నుంచి నటన పరంగా చాలా ఆసక్తిని కనపరుస్తూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీలోని పెద్ద ఎన్టీఆర్ కి ఎలాంటి ప్రతిభ అయితే ఉండేదో అలాంటి ప్రతిభనే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా వచ్చిందని చాలా మంది చెప్తూ ఉంటారు. దానివల్లే ఆయన ఎన్టీఆర్ గారికి సరైన వారసుడుగా ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడని కూడా మరి కొంత మంది అభిప్రాయపడుతుంటారు…