https://oktelugu.com/

Gopichand: గోపిచంద్ మొహమాటానికి పోయి చేసిన సినిమాలేంటో తెలుసా..? అందులో ఎన్ని ప్లాపులంటే..?

మూడు నాలుగు సినిమాల్లో విలన్ పాత్రలను పోషించి విలనిజాన్ని పండించడంలో గోపీచంద్ లాంటి నటుడు తెలుగు లో మరొకరు లేరు అనేంతలా పేరు, ప్రఖ్యాతలు అయితే సంపాదించుకున్నాడు.

Written By: , Updated On : March 2, 2024 / 02:20 PM IST
Gopichand flop movies
Follow us on

Gopichand: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్న కూడా మ్యాచో స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు గోపీచంద్. మొదట గోపిచంద్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘తొలివలపు’ అనే సినిమాతో హీరోగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ఇక ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో తేజ డైరెక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన ‘ జయం ‘ సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

అప్పటినుంచి వరుసగా ఒక మూడు నాలుగు సినిమాల్లో విలన్ పాత్రలను పోషించి విలనిజాన్ని పండించడంలో గోపీచంద్ లాంటి నటుడు తెలుగు లో మరొకరు లేరు అనేంతలా పేరు, ప్రఖ్యాతలు అయితే సంపాదించుకున్నాడు. కానీ తన టార్గెట్ మాత్రం హీరో అవ్వడమే కాబట్టి యజ్ఞం సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఈ సినిమా మంచి గుర్తింపును సంపాదించి పెట్టడంతో పాటు సూపర్ సక్సెస్ ని సాధించింది.

ఇక దాంతో గోపిచంద్ కు మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పడింది. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది స్టార్ డైరెక్టర్లు గోపీచంద్ దగ్గరకు వచ్చి ఆయనతో కొన్ని సినిమాలు చేశారు. ఆయనకు కథలు నచ్చకపోయినప్పటికీ స్టార్ డైరెక్టర్లను రిజెక్ట్ చేసే ఉద్దేశ్యం లేకపోవడంతో ఆయన ఆ సినిమాలు చేయాల్సి వచ్చింది. అందులో ముఖ్యంగా వెంకటేష్ కి ‘కలిసుందాం రా ‘ అనే సినిమాతో ఒక భారీ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను అందించిన ఉదయ్ శంకర్ డైరెక్షన్ లో ‘రారాజు ‘ అనే సినిమా చేశాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అతనికి ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని అర్థం అయిపోయిందట. అయినప్పటికీ ఇచ్చిన మాట కోసం సినిమా చేయాల్సి వచ్చిందట. ఇక ఇదిలా ఉంటే బి వి రమణ దర్శకత్వంలో ఒంటరి అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా పరిస్థితి కూడా అలాంటిదే. అయితే బివి రమణ ఈ సినిమాకు ముందే సుమంత్ తో గౌరీ, తరుణ్ తో ఎలా చెప్పను లాంటి సినిమాలు తీసి సక్సెస్ లను అందుకున్నాడు.

అందువల్లే ఆయన చెప్పిన కథ మీద గోపిచంద్ కి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ ఆయనని కాదనలేక ఈ సినిమా చేశాడు. ఫైనల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక కెరీయర్ మొదట్లో తనకు తగిలిన ఇలాంటి కొన్ని దెబ్బల వల్లే మొహమాటానికి పోయి సినిమాలు చేయకూడదనే ఒక సత్యాన్ని అయితే తెలుసుకున్నాడు. ఇక దాంతో ఇప్పుడు కథ బాగుంటేనే సినిమా చేస్తాను అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు…