మనల్ని నిత్యం అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఆయితే చాలా ఆరోగ్య సమస్యలకు మన వంటింట్లో ఉండే వెల్లుల్లి ద్వారా సులభంగా చెక్ పెట్టవచ్చు. పరగడుపునే వెల్లుల్లి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వెల్లుల్లిని రుచి కోసం వంటల్లో వాడినప్పటికీ ఇందులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి. అల్లియమ్ సాటివుమ్ వెల్లుల్లి శాస్త్రీయ నామం కాగా వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
Also Read: చలికాలంలో ఉసిరి తీసుకుంటే కలిగే లాభాలు తెలుసా..?
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వెల్లుల్లి తోడడుతుంది. పరగడుపునే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల పొట్టలోని హానికారక బ్యాక్టీరియాకు సులభంగా చెక్ పెట్టవచ్చు. జ్వరం, ఉబ్బసం, కాలేయ సమస్యలు, పిత్తాశయ సంబంధ సమస్యలకు వెల్లుల్లి ఔషధంలా ఉపయోగపడుతుంది. ఛాతీ సంబంధిత సమస్యల బారిన పడకుండా వెల్లుల్లి రక్షిస్తుంది.
Also Read: నోటిపూతతో బాధ పడుతున్నారా.. చెక్ పెట్టే చిట్కాలివే..?
వెల్లుల్లిని తీసుకోవడం వల్ల న్యూమోనియాకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీపీని నియంత్రించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది. హైబీపీ సమస్యతో బాధ పడేవాళ్లు వెల్లుల్లి తీసుకోవడం వల్ల చిన్న ధమనులపై ఒత్తిడి తగ్గుతుంది. వాపులు, నొప్పులు ఉన్నచోట వెల్లుల్లి రసంతో మర్ధన చేస్తే ఆ సమస్యలు తగ్గుతాయి. గుండెపోటును సమర్థవంతంగా నివారించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
వెల్లుల్లిని వాడటం వల్ల దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తేనెతో కలిపి వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్ లను సులభంగా నిరోధించే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీళ్లలో వెల్లుల్లి రసం వేసుకుని ముఖం శుభ్రం చేసుకుంటే శరీర కాంతి పెరుగుతుంది.