https://oktelugu.com/

ల్యాప్ టాప్ వేడెక్కుతోందా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

దేశంలో ల్యాప్ టాప్ ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఉన్నత చదువులు చదివే విద్యార్థులతో పాటు కొందరు వ్యాపారులు కూడా ల్యాప్ టాప్ లను కొనుగోలు చేయడానికి, ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల విద్యార్థులు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఆన్ లైన్ క్లాసుల కొరకు ల్యాప్ టాప్ లను వినియోగించడం జరుగుతుంది. Also Read: భవిష్యత్తులో కరోనా వైరస్ సాధారణ జలుబులా మారిపోతుందా..? అయితే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 15, 2021 / 09:41 AM IST
    Follow us on

    దేశంలో ల్యాప్ టాప్ ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఉన్నత చదువులు చదివే విద్యార్థులతో పాటు కొందరు వ్యాపారులు కూడా ల్యాప్ టాప్ లను కొనుగోలు చేయడానికి, ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల విద్యార్థులు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఆన్ లైన్ క్లాసుల కొరకు ల్యాప్ టాప్ లను వినియోగించడం జరుగుతుంది.

    Also Read: భవిష్యత్తులో కరోనా వైరస్ సాధారణ జలుబులా మారిపోతుందా..?

    అయితే ఎక్కువ సమయం ల్యాప్ టాప్ లను వినియోగిస్తే ల్యాప్ టాప్ వేడెక్కే అవకాశం ఉంది. ఎక్కువసార్లు ల్యాప్ టాప్ వేడెక్కితే హార్డ్ వేర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ల్యాప్ టాప్ వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ల్యాప్ టాప్ లో ఉండే ఎప్పుడూ సాధారణ వేగంతో తిరుగుతుంది. అయితే ఆ ఫ్యాన్ వేగం పెరుగుతుందంటే మాత్రం ల్యాప్ టాప్ వేడెక్కిందని గుర్తుంచుకోవాలి.

    Also Read: సంక్రాంతి రోజు ఏ పనిచేయాలి? ఏ పని చేయకూడదు?

    ల్యాప్ టాప్ వేడెక్కితే సీపీయూల క్లాక్ స్పీడ్ తగ్గే అవకాశం ఉండటం వల్ల కంప్యూటర్ వేగం కూడా తగ్గుతుంది. కొన్ని ప్రత్యేకమైన టూల్స్ సహాయంతో ల్యాప్ టాప్ లో ఏ పార్ట్ వేడెక్కిందనే విషయాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ల్యాప్ టాప్ ను ఎక్కువగా వినియోగించే వాళ్లు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లి ఫ్యాన్ ను, రెక్కలను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాప్ టాప్ లను టేబుళ్లపై ఉంచి మాత్రమే వినియోగించాలి.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    దిండ్లు, దుప్పట్లపై ఉంచితే ల్యాప్ టాప్ లోకి గాలి సరిగ్గా ప్రసరించకపోకవడం వల్ల ల్యాప్ టాప్ వేడెక్కే అవకాశం ఉంటుంది. ఎక్కువ సమయం ల్యాప్ టాప్ ను వినియోగించే వాళ్లు ల్యాప్ టాప్ కూలర్ లేదా కూలింగ్ ప్యాడ్ లను తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ల్యాప్ టాప్ లో వేడి సమస్య తగ్గకపోతే సాఫ్ట్ వేర్ లో ఇబ్బందులు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.