https://oktelugu.com/

సెకండ్ ఇన్నింగ్స్ లో బోల్డ్ పాత్ర‌లతో.. !

తెలుగులో వేయి అబద్దాలు సినిమాతో పరిచయమై సునీల్ హీరోగా వచ్చిన భీమవరం బుల్లోడులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ‘ఏస్తేర్’. ఈమె ఆ తర్వాత జయ జానకి నాయిక, గరం వంటి చిత్రాలలో చిన్న రోల్స్ లో కూడా నటించింది. సింగర్ నోయల్‌ని ప్రేమ వివాహం చేసుకున్న ఏస్తేర్ పెళ్లయిన మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య విభేదాల కారణంగా 2019 జూన్ నెలలో విడిపోయి, 2020 సెప్టెంబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి నోయల్, […]

Written By:
  • admin
  • , Updated On : January 15, 2021 / 10:05 AM IST
    Follow us on


    తెలుగులో వేయి అబద్దాలు సినిమాతో పరిచయమై సునీల్ హీరోగా వచ్చిన భీమవరం బుల్లోడులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ‘ఏస్తేర్’. ఈమె ఆ తర్వాత జయ జానకి నాయిక, గరం వంటి చిత్రాలలో చిన్న రోల్స్ లో కూడా నటించింది. సింగర్ నోయల్‌ని ప్రేమ వివాహం చేసుకున్న ఏస్తేర్ పెళ్లయిన మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య విభేదాల కారణంగా 2019 జూన్ నెలలో విడిపోయి, 2020 సెప్టెంబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి నోయల్, ఎస్తేర్ ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీగా ఉన్నారు. నోయల్ సింగర్‌గా, నటుడిగా ఉంటూనే రియాలిటీ షోలతో బిజీ అయ్యాడు. ఇక ఎస్తేర్ విషయానికి వస్తే సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

    Also Read: టీజర్ టాక్: రీఎంట్రీలో ‘వకీల్ సాబ్’ అదరగొట్టేశాడు

    ఏస్తేర్ తన కొత్త ఇన్నింగ్స్‌లో శృంగార క్రైమ్ థ్రిల్లర్‌ లను ఎంచుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల మలయాళ శృంగార తార ష‌కీలా జీవితం ఆధారంగా రూపొందిన `ష‌కీలా` చిత్రంలో బోల్డ్ పాత్ర‌లో న‌టించిన ఏస్తేర్ మ‌రోసారి డేరింగ్ పాత్ర‌లో బోల్డ్‌గా న‌టించ‌బోతోందని సమాచారం. ఎస్‌.ఆర్ తిరుప‌తి దర్శకత్వంలో వస్తున్న `హీరోయిన్‌` చిత్రంలో ఎస్తేర్ పోర్న్ స్టార్‌గా కనువిందు చేయనుందట.

    Also Read: అల్లుడు అదుర్స్ రివ్యూ : రెగ్యులర్ సినిమాల సమ్మేళనం !

    `ఉత్త‌ర‌` చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు తిరుప‌తి మాట్లాడుతూ… “సొసైటీ క‌ళ్ల‌ప్ప‌గించి చూసే క‌ళారంగం వెన‌క గుండె ప‌గిలే గాయం వుంది. మ‌నం చూసే ప్ర‌తి అద్భుతం వెన‌క మ‌రో నిజం దాగి వుంది” అని అన్నారు. లీవ్ ఇన్ సి క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నిర్మించనున్నారు. త్వరలోనే మిగిలిన నటి నటులు , సాంకేతిక విభాగం గురించి వివరాలు తెలియజేస్తామని దర్శకుడు తిరుప‌తి చెప్పారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్