Mosquitoes: దోమల వల్ల ఇన్ని వ్యాధులు వస్తాయా? కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

ప్రతి సంవత్సరం మిలియన్ల ప్రజలు దోమల వల్ల ప్రభావితం అవుతున్నారు. అందుకే దోమల నివారణ, నిర్వహణ కోసం సమర్థవంతమైన చర్యలను అమలు చేయడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.

Written By: Swathi, Updated On : August 21, 2024 12:00 pm

Mosquitoes

Follow us on

Mosquitoes: ప్రపంచవ్యాప్తంగా దోమల బెడద రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఈ దోమల వల్ల ప్రతి సంవత్సరం 500,000 కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు అని తెలుస్తోంది. అయితే ఎంతోమంది మలేరియా వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ మలేరియా దోమల ద్వారా సంక్రమిస్తుందని 1897లో రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. దోమల వల్ల కేవలం మలేరియా మాత్రమే కాదు చాలా రకాల వ్యాధులు వస్తాయి. అవేంటో తెలుసుకుంటే దోమల నుంచి దూరంగా ఉండాలి అనిపిస్తుంది. మరి ఓ సారి ఈ ఆర్టికల్ ను చదివేసేయండి.

ప్రతి సంవత్సరం మిలియన్ల ప్రజలు దోమల వల్ల ప్రభావితం అవుతున్నారు. అందుకే దోమల నివారణ, నిర్వహణ కోసం సమర్థవంతమైన చర్యలను అమలు చేయడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.

మలేరియా: అనాఫిలిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది మలేరియా. అత్యంత తీవ్రమైన అనారోగ్యాలలో ఒకటి మలేరియా.ఈ రకం దోమలు సమశీతోష్ణ మండలాల్లో కనిపిస్తుంటాయి. సాధారణ లక్షణాలు మాత్రమే ఉంటాయి. అంటే తీవ్రమైన జ్వరం, జలుబు, తలనొప్పి, విపరీతమైన చలి, వనుకు, టెంపరేచర్ ఎక్కుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డెంగ్యూ: డెంగ్యూ వైరస్ వల్ల ఈ జ్వరం వస్తుంది. దోమల ద్వారా వ్యాపిస్తుంది ఈ జ్వరం. వ్యాధి సోకిన మూడు నుంచి పద్నాలుగు రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి దీని భారిన పడితే కష్టమే. జ్వరం, దద్దుర్లు, వికారం, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కూడా వారం వరకు ఉంటాయి. అంతర్గత రక్తస్రావం వల్ల కొందరు మరణిస్తారు కూడా. అధిక జ్వరం, తలనొప్పి, అలసట, కీళ్ళు కండరాలలో నొప్పి, అతిసారం, వికారం, కళ్ళు మంటలు, వాంతులు వంటివి సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు అంటున్నారు నిపుణులు. తీవ్రమైన డెంగ్యూ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవడం ఉత్తమం.

చికెన్‌గున్యా: చికెన్‌గున్యా అనే ఒక అంటు వైరస్ ప్రజలకు సోడం వల్ల ఈ చికెన్ గున్యా వస్తుంది. ఈడిస్ ఈజిప్టి దోమల ద్వారా ఇది వ్యాపిస్తుంది. జ్వరం, కీళ్లలో అసౌకర్యం, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల వాపు, దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. చికెన్ గున్యా వస్తే సాధారణంగా ఒక వారంలో కోలుకుంటారు. కానీ అరుదైన సందర్భాల్లో, నెలలు లేదా సంవత్సరాల పాటు ఈ వ్యాధి కొనసాగుతుంది. కొన్ని క్లినికల్ లక్షణాలు జికా, డెంగ్యూ చికున్‌గున్యాతో అతివ్యాప్తి చెందడం వల్ల ఇలా జరుగుతుందట.

జికా: దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి జికా వైరస్. సాధారణంగా లక్షణాలు కనిపించవు. డెంగ్యూ జ్వరం లాగా అభివృద్ధి చెందుతుంది ఈ వైరస్. జ్వరం, కళ్ళు ఎర్రబడటం, కీళ్లలో అసౌకర్యం, తలనొప్పి, దద్దుర్లు వంటివి కొన్ని కేసుల్లో కనిపిస్తుంటాయట. జికా వైరస్ సోకిన గర్భిణీ స్త్రీలు మైక్రోసెఫాలీ వంటి పెద్ద వైద్య వైకల్యాలను కలిగి ఉన్న శిశువులకు జన్మనిస్తారు అంటున్నారు నిపుణులు. దీని వల్ల శిశువులకు జీవితకాల వైకల్యం ఉంటుందట.

పసుపు జ్వరం: పసుపు జ్వరం కొన్ని సార్లు మాత్రమే వైరల్ అనారోగ్యంగా మారుతుంది. జ్వరం, చలి, ఆకలి లేకపోవడం, వికారం, వెన్నునొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జ్వరం ఐదు రోజుల్లో తగ్గకపోతే జాగ్రత్త పడాలి. ఇప్పటికీ ప్రతి సంవత్సరం దీని వల్ల 30,000 కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఏడెస్ ఈజిప్టి దోమ వల్ల ఈ జ్వరం వస్తుంది. ఇవన్నీ కూడా దోమల వల్ల మాత్రమే వ్యాప్తి చెందుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణులు.