Milk For Child: పిల్లలు తాగడానికి ఏ పాలు మంచివో మీకు తెలుసా..?

Milk For Child:  శ్రేష్ఠమైన బలవర్ధక ఆహారాలలో పాలు ఒకటనే సంగతి తెలిసిందే. పాలు తాగడం వల్ల పిల్లలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆవులు, గేదెల పాలను తీసుకోవడం ద్వారా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆవు పాలను పూజల్లో కూడా వినియోగిస్తారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన నిత్య జీవితంలో పాలు ముఖ్యపాత్రను పోషిస్తాయి. అయితే పిల్లలకు మాత్రం ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవని పెద్దలు చెబుతారు. అయితే కొంతమంది మాత్రం […]

Written By: Kusuma Aggunna, Updated On : August 24, 2021 5:34 pm
Follow us on

Milk For Child:  శ్రేష్ఠమైన బలవర్ధక ఆహారాలలో పాలు ఒకటనే సంగతి తెలిసిందే. పాలు తాగడం వల్ల పిల్లలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆవులు, గేదెల పాలను తీసుకోవడం ద్వారా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆవు పాలను పూజల్లో కూడా వినియోగిస్తారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన నిత్య జీవితంలో పాలు ముఖ్యపాత్రను పోషిస్తాయి. అయితే పిల్లలకు మాత్రం ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవని పెద్దలు చెబుతారు.

అయితే కొంతమంది మాత్రం పిల్లల కోసం గేదె పాలనే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఆవు పాలు పల్చగా ఉండటంతో పాటు తేమ శాతం తక్కువగా ఉంటుంది. గేదె పాలలో ఫ్యాట్, ప్రోటీన్ ఉండటంతో పాటు ఈ పాలను ఎక్కువగా తాగితే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. శరీరానికి ఎక్కువ ప్రోటీన్లు కావాలనుకుంటే మాత్రం గేదెపాలను తీసుకోవాలి. మిగిలిన వాళ్లకు మాత్రం ఆవుపాలు శ్రేష్టమని చెప్పవచ్చు.

ఆవుపాలలో నీటిశాతం అధికంగా ఉంటుంది. గేదె పాలలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ పరంగా గేదె పాలు తాగడం వల్లే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లు గేదెపాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే మంచిదని చెప్పవచ్చు. ఆవు పాలలో పొటాషియం, సోడియం తక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఆవుపాలను ఎక్కువగా తాగితే మంచిది.

సందేశ్, రసగుల్లా తయారు చేయడంలో ఆవు పాలు తోడ్పడతాయి. పెరుగు, పనీర్, ఖీర్ తయారీ కోసం కూడా ఆవుపాలను ఎక్కువగా వినియోగిస్తారు. అయితే మంచి నిద్రకు మాత్రం గేదెపాలు మంచివి. రాత్రి నిద్రపోయే ముందు గేదె పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.