దాంతో సందీప్ తన సినిమా ‘గల్లీ రౌడీ’ (Gully Rowdy) రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంటూ మంచి డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. నిజానికి ‘గల్లీ రౌడీ’ సినిమాని ఎప్పుడో ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చి అది కుదరలేదు. ఆ తర్వాత ఓటీటీ ఆఫర్ వచ్చింది. అమెజాన్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. ఎందుకో ఆ ఆఫర్ కూడా వర్కౌట్ అవ్వలేదు.
అంతలో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. సెప్టెంబర్ 3న తమ సినిమా రిలీజ్ కాబోతుంది అంటూ సందీప్ కిషన్ టీమ్ ఒక పోస్టర్ ను వదిలింది. ఆ డేట్ ప్రకారం ఫుల్ పబ్లిసిటీ ప్లాన్ చేసి.. సినిమాని జనంలోకి తీసుకు వెళ్ళడానికి బాగా కసరత్తులు చేస్తున్నారు. కానీ సడెన్ గా సెప్టెంబర్ 3న గోపీచంద్ ‘సీటిమార్’ కూడా రిలీజ్ కి రెడీ అయింది.
ఇది ఊహించని సందీప్ కిషన్ పోటీలో తన సినిమాని రిలీజ్ చేయడం ఇష్టం లేక.. సెప్టెంబర్ 10న రిలీజ్ కి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ, ఆ రోజు కూడా ‘లవ్ స్టోరీ’ విడుదల కాబోతుంది అని అధికారిక ప్రకటన వచ్చింది. దాంతో, ‘గల్లీ రౌడీ’ పరిస్థితి మళ్ళీ పోస్ట్ ఫోన్ అయింది. ఇప్పుడు ఇంకో కొత్త డేట్ కోసం టీమ్ ప్లాన్ చేస్తోంది.
మరి ఆ సోలో డేట్ ఎప్పుడు దొరుకుతుంది. సందీప్ కిషన్ సినిమాకి ఎప్పుడు మోక్షం దొరుకుతుంది అనేది చూడాలి. కోన వెంకట్ సమర్పణలో జీ నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ ‘గల్లీ రౌడీ’ సినిమా సందీప్ కిషన్ కి చాలా కీలకం కానుంది .