https://oktelugu.com/

Earthquake: ఏపీలో భూ ప్రకంపనలు.. ఆ రెండు జిల్లాల్లో కలకలం

ఏపీలో భూ ప్రకంపనలు (Earthquake) కలకలం రేపాయి. బంగాళాఖాతంలో భూంకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. దీని తీవ్రతతో ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాల్లోనూ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి 260 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం 12.35 గంటలకు భూమి కంపించింది. ఏపీలోని కాకినాడకు 296 కి.మీల దూరంలో ఆగ్నేయంగా తమిళనాడు రాజధాని చెన్నైకి 320 కి.మీ దూరంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 24, 2021 / 05:37 PM IST
    Follow us on

    ఏపీలో భూ ప్రకంపనలు (Earthquake) కలకలం రేపాయి. బంగాళాఖాతంలో భూంకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. దీని తీవ్రతతో ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాల్లోనూ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి.

    పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి 260 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం 12.35 గంటలకు భూమి కంపించింది.

    ఏపీలోని కాకినాడకు 296 కి.మీల దూరంలో ఆగ్నేయంగా తమిళనాడు రాజధాని చెన్నైకి 320 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప ప్రభావంతో తమిళనాడులోనూ ప్రకంపనలు వచ్చాయి.

    ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని తీరాల్లో సముద్ర గర్భంలో 10.కి.మీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

    ఇక భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని ఏపీ భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. సునామీ వస్తుందని వాట్సాప్ ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.