https://oktelugu.com/

ఈ లక్షణాలు కనిపిస్తే పక్షవాతం వచ్చే ఛాన్స్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

దేశంలోని ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో పక్షవాతం కూడా ఒకటి. మెదడుకు సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోయినా బ్రెయిన్ కు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినా బ్రెయిన్ టిష్యూకు ఆక్సిజన్ తో పాటు పోషకాలు అందే అవకాశం అయితే ఉండదు. రక్త ప్రసరణ జరగని పక్షంలో బ్రెయిన్ సెల్స్ సెకన్ల వ్యవధిలో చనిపోయే అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైతే క్షణాల వ్యవధిలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 7, 2021 / 02:45 PM IST
    Follow us on

    దేశంలోని ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో పక్షవాతం కూడా ఒకటి. మెదడుకు సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోయినా బ్రెయిన్ కు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినా బ్రెయిన్ టిష్యూకు ఆక్సిజన్ తో పాటు పోషకాలు అందే అవకాశం అయితే ఉండదు. రక్త ప్రసరణ జరగని పక్షంలో బ్రెయిన్ సెల్స్ సెకన్ల వ్యవధిలో చనిపోయే అవకాశం ఉంటుంది.

    ఎవరికైనా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైతే క్షణాల వ్యవధిలో బ్లడ్ సెల్స్ చనిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం ద్వారా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు తగ్గడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కొన్ని లక్షణాలు మీలో కనిపిస్తే మీకు పక్షవాతం వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.

    భాషను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడం, మాట్లాడే మాటలలో తడబాటు, గందరగోళ పరిస్థితి, కాళ్లు లేదా చేతులపై నంబ్ నెస్ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పక్షవాతం వస్తే ఒక కంటి చూపు మందగించడంతో పాటు నోటికి ఒకవైపు వంగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. అకస్మాత్తుగా విజన్ బ్లర్ అయ్యే అవకాశం ఉంటుంది.

    డిజ్జీనెస్, బ్యాలెన్స్ కోల్పోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హై బీపీ, ఒబెసిటీ, మద్యపానం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, బర్త్ కంట్రోల్ పిల్స్ పక్షవాతం వచ్చే రిస్క్ ను పెంచే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఆరోగ్య సమస్యలలో ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది.