https://oktelugu.com/

Peace  : సంపద ఉన్నా ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే?

మన చుట్టూ డబ్బు, బంగారం, ఎక్కువ సంపద ఉన్న వాళ్లని చూస్తూనే ఉంటాం. నఇలా ఉన్న సంపదతో చాలా మంది జీవితాలని బాగు చేయవచ్చు. కానీ ఎవరూ కూడా సాయం చేయరు. ఎవరో కొంతమంది మాత్రమే సాయం చేస్తుంటారు. అయితే కొందరికి డబ్బు ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రశాంతత మాత్రం ఉండదు.

Written By:
  • Vadde
  • , Updated On : September 5, 2024 / 07:00 AM IST

    Peace

    Follow us on

    Peace  :  ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కువగా డబ్బు సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, రిచ్ గా ఉండాలని కోరుకుంటారు. అయితే డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్లు.. ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ డబ్బుకి, ప్రశాంతానికి అసలు సంబంధమే లేదు. ఎంత సంపద ఉన్న ఈ రోజుల్లో చాలామంది ప్రశాంతంగా ఉండట్లేదు. ఏమి లేని వాళ్లకు కూడా ప్రశాంతత ఉంటుంది. కానీ అన్ని ఉన్న వాడికి అసలు కాస్త అయిన కూడా ప్రశాంతత ఉండదు. అన్ని సౌకర్యాలు ఇంట్లో ఉంటాయి. అసలు వాళ్లకి ఎలాంటి లోటు ఉండదు. కానీ జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. అయితే జీవితంలో మనకి ఎంత సంపద ఉన్న ప్రశాంతత ఎలా? ఎప్పుడు వస్తుందో? మరి చూద్దాం.

    మన చుట్టూ డబ్బు, బంగారం, ఎక్కువ సంపద ఉన్న వాళ్లని చూస్తూనే ఉంటాం. నఇలా ఉన్న సంపదతో చాలా మంది జీవితాలని బాగు చేయవచ్చు. కానీ ఎవరూ కూడా సాయం చేయరు. ఎవరో కొంతమంది మాత్రమే సాయం చేస్తుంటారు. అయితే కొందరికి డబ్బు ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రశాంతత మాత్రం ఉండదు. ఎంత సంపద ఉన్న.. ప్రశాంతత అనేది సాయం ద్వారా మాత్రమే వస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్ల దగ్గర ఉన్న డబ్బుతో పేదల జీవితాలని మార్చేయవచ్చు. కానీ ఎవరు కూడా అలా చేయరు. మన దగ్గర ఉన్న డబ్బుతో ఎంత విలాసవంతమైన జీవితం గడిపిన రాని ప్రశాంతత.. పేదలకు సాయం చేస్తే తప్పకుండా ప్రశాంతత వస్తుంది.మన చుట్టూ చాలా మంది డబ్బులతో ఇబ్బంది పడుతుంటారు. కానీ సాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. సంపద ఉన్నవాళ్లు.. వాళ్ల దగ్గర ఉన్న డబ్బులో ఒక శాతం అయినా పేదలకు ఖర్చు చేస్తే.. వాళ్ల జీవితమే మారిపోతుంది. మనిషికి మనిషి సాయం చేసుకున్నప్పుడే నిజమైన ప్రశాంతత వస్తుంది. కొందరు మట్టి ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా బ్రతుకుతారు. వాళ్ల పిల్లలకి కనీసం రోజుకి ఒక పూట కూడా భోజనం పెట్టలేరు. ఇలాంటి వాళ్లని రోజూ చూస్తుంటారు. కానీ ఒక్కరు కూడా సాయం చేయరు. ఆకలితో ఉన్నవాళ్లకి ఒక్క పూట అన్నం పెడితే ప్రశాంతత విలువ తెలుస్తుంది. ఇలా వచ్చిన ప్రశాంతత ఎన్ని కోట్లు ఇచ్చిన కొనలేం. మన దగ్గర దాచుకునేంత డబ్బు.. అవసరానికి ఉపయోగపడనిది ఎంత ఉన్న వేస్ట్. అంత సంపద ఉంది అని గొప్పలు చెప్పుకోవడానికి తప్పా.. ఎవరికీ పనికి రావు. డబ్బులు లేక చాలా మంది పిల్లలు చదువుకోక అడుక్కుకుంటున్నారు. ఇలాంటి వాళ్లు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఒక్కసారి సాయం చేస్తే.. వచ్చే ఆ ఫీల్ లైఫ్ లో ఎప్పుడు మరిచిపోరు. ఎంత సంపద ఉన్న.. చిన్న సాయమైన చేయండి. అప్పుడే మీ జీవితానికి ప్రశాంతత వస్తుంది.