Parenting Tips : పిల్లలకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు క్రమశిక్షణ బాధ్యతలు నేర్పించాలి. వాళ్లు చేసిన తప్పులని సరిదిద్దుతా.. భవిష్యత్తుకి మంచి పునాది వేయాలి. అయితే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్ని ఏదో రకంగా తిడుతూనే ఉంటారు. తప్పు చేస్తే తిట్టడం వేరు. కానీ తప్పు చేయకుండా కావాలనే పిల్లలని తిడతారు. ఇలా వాళ్లని కంట్రోల్ లో పెట్టుకోవడం వల్ల భయంతో ఉంటారని పేరెంట్స్ భావిస్తారు. కానీ పిల్లలని ఇలా కొట్టడం వల్ల భయం కంటే.. పేరెంట్స్ మీద గౌరవం పోతుంది. పిల్లలను.. పిల్లలా చూడాలి. కొందరు తల్లిదండ్రులు వాళ్ల పిల్లను నోటికి వచ్చినట్టు తిడతారు. పక్కంటి పిల్లలని చూసి మరి.. వాళ్లు అలా ఉన్నారు. నువ్వు ఇలా ఉన్నావు అని అంటుంటారు. అయితే పిల్లలని తిట్టేముందు పేరెంట్స్ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మరి అవేంటో తెలుసుకుందాం.
పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్లకు ఏదయినా నెమ్మదిగా మాత్రమే చెప్పాలి. కానీ కొందరు గట్టిగా అరుస్తూ పిల్లలకు చెబుతుంటారు. ఇలా చెప్పడం వల్ల పిల్లలు కూడా పెద్ద అయిన తరువాత ఇలానే ప్రవర్తిస్తారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచాలంటే.. వాళ్లకి ఏ విషయాన్ని అయిన కూడా వాళ్లకి అర్థం అయినట్లు చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువగా అరుస్తూ.. చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అందరితో సరిగ్గా కలవలేరు. ఒంటరిగా ఎక్కువగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలని అన్ని విధాలుగా అర్థం చేసుకోవాలి. వాళ్లకి ఎలా చెప్తే అర్థం అవుతుందో.. ఆ విధంగా మాత్రమే చెప్పాలి. పిల్లలకు చెప్పాలిసిన తల్లిదండ్రులే వాళ్ల మీద అరిస్తే.. పిల్లలు ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఇది వాళ్ల మానసిక సమస్యలపై కూడా ప్రభావం పడుతుంది.
కొందరు తల్లిదండ్రులు పిల్లలని బయట వాళ్ల దగ్గర తిట్టడం, కొట్టడం వంటివి చేస్తారు. ఇలా బయట వాళ్ల ముందు పిల్లలని తిడితే వాళ్లు అభ్రద్రత భావానికి గురవుతారు. మీరు తిట్టారు అనే కోపం కంటే బయట వాళ్ల ముందు తిట్టారని.. ఏదయినా చేసుకునే ప్రమాదం ఉంటుంది. పిల్లలు అన్నాక తప్పులు చేయడం సహజమే. వాళ్లు చేసిన తప్పులను పేరెంట్స్ సరిదిద్దాలి. ఇంకోసారి తప్పు చేయకుండా వాళ్లకు చెప్పాలి. అంతే కానీ వాళ్లని మాటలతో బాధపెట్టకూడదు. పిల్లలని తిట్టకుండా.. వాళ్లకు అర్థం అయ్యేలా అన్ని చెప్పాలి. తప్పుడు పదాలు వాడి పిల్లలను తిట్టకూడదు. పేరెంట్స్ ఆ పదాలు వాడటం వాళ్ల.. పిల్లలకు కూడా అవే అలవాటు అవుతాయి. ఎందుకు అంటే తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. కొందరు పేరెంట్స్ పిల్లలను సపోర్ట్ చేయకుండా.. ప్రతీ విషయానికి విమర్శిస్తారు. ఇలా కూడా పిల్లలతో ప్రవర్తించవద్దు. దీనివల్ల పిల్లలు వాళ్ల మీద ఉన్న కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటారు. కాబట్టి పిల్లలతో మాట్లాడేటప్పుడు అన్ని విషయాలని చూసుకుని మాట్లాడాలి.