Better Sleep Tips: ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా.. అంటే నిండా నిద్ర ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో ఉద్యోగం, వ్యాపారం తదితర కారణాలవల్ల సరైన నిద్రపోవడం లేదు. అంతేకాకుండా రాత్రులు చాలాసేపు మెలకువతో ఉంటూ ఫోన్ చూడడం లేదా కాలక్షేపం చేయడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా అనుకున్న సమయానికి నిద్రపోకుండా ఆలస్యంగా నిద్రపోతున్నారు. అయితే ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఇలా అసమతుల్యంగా నిద్రించడం.. నిద్ర లేవడం వల్ల ఊహించని ఆరోగ్య పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? నాణ్యమైన నిద్ర కోసం ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి?
కొంతమంది రాత్రి నిద్ర పట్టడానికి అనేక వ్యసనాలను ఏర్పాటు చేసుకుంటారు. ఉదయం నుంచి, సాయంత్రం వరకు అనేక పనుల ద్వారా అలసిపోయిన వారు మద్యం తీసుకోవడం వల్ల నిద్ర పడుతుందని భావిస్తూ ఉంటారు. అయితే ఇది రెండు పెగ్గులతో ప్రారంభమై పీకలదాకా తాగే అవసరం ఏర్పడుతుంది. మద్యం తాగడం వల్ల మత్తుగా ఉండి కొద్దిసేపు మాత్రమే నిద్ర పడుతుంది. కానీ ఆ తర్వాత ఆకస్మాత్తుగా తెలివి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో నిద్ర భంగం అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా కొందరు రాత్రి నిద్ర పట్టడానికి ప్రత్యేకంగా మాత్రలు వేసుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అయితే నాణ్యమైన నిద్రపోవడానికి ఏం చేయాలి? రాత్రి పడుకునే సమయంలో పాలు తీసుకోవాలి. పాలలో ఉండే పదార్థాలతో నాణ్యమైన నిద్ర వస్తుంది. అయితే ఇందులో పసుపు వేయడం వల్ల మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. వాకింగ్ చేసేవారు ఉదయం తో పాటు సాయంత్రం కూడా చేయాలి. సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల అలసిపోయినట్లు అనిపించి నాణ్యమైన నిద్ర వస్తుంది. నిద్రపోయే ముందు కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయాలి. రోజంతా జరిగిన విషయాలపై చర్చించుకోవాలి. అయితే మంచి మాటలనే మాట్లాడుతూ ఉండాలి. వీలైతే పిల్లలతో సరదాగా ఆడుకోవాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ అవకాశం లేనివారు ధ్యానం చేయడం మంచిది.
అలాగే ప్రతిరోజు వాకింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. శారీరకంగా శ్రమ ఉంటేనే శరీరం అలిసిపోయి త్వరగా నిద్ర వస్తుంది. అలాగే ఒకే చోట కూర్చొని పనిచేసేవారు కనీసం 30 నిమిషాలకు ఒకసారి అయినా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఏరా తిరగడం వల్ల శరీరంలోని అవయవాల కదలిక ఏర్పడి రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త ప్రసరణ సరిగా ఉండడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోయే ప్రయత్నం చేయాలి.