Hyperactive Children: ప్రస్తుత కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం పెరిగిపోయింది. చాలావరకు శారీరక శ్రమలు తగ్గించి పనులు సులువుగా చేసుకునేందుకు వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నాము. వీటిలో ప్రధానంగా మొబైల్ ఉంటుంది. మొబైల్ చేతిలో ఉండడం వల్ల ఎన్నో రకాల పనులు పూర్తవుతాయి. అంతేకాకుండా కమ్యూనికేషన్ పెంచుకోవడానికి మొబైల్ చాలా వరకు ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఈ మొబైల్ తో చిన్నారుల జీవితం చిన్నాభిన్నం అవుతుందంటే ఎవరు నమ్మరు. కానీ ఇప్పటికే చాలామంది చిన్నారులు మొబైల్ మాయలో పడి తమ వాస్తవిక జీవితానికి దూరం గా ఉంటున్నారు. ఇందుకు కారణం తల్లిదండ్రులే అని కొందరు మానసిక నిప్పులు అంటున్నారు. అంతేగాక ఇటీవల చాలామంది పిల్లల్లో ADHD నీ గుర్తించినట్లు కొందరు వైద్యులు తెలుపుతున్నారు. అసలు ADHD అంటే ఏమిటి?
ఇటీవల చాలామంది పిల్లల్లో ప్రవర్తన వింతగా కనిపిస్తోంది. కొందరు ఆహారం తినాలంటే కచ్చితంగా మొబైల్ ఉండాల్సిందే నన్న మారం చేస్తున్నారు. మరికొందరు మొబైల్ లేకుండా నిద్రపోవడం లేదు. ఇంకొందరు మొబైల్ చూస్తూ ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా పిల్లలు తయారు కావడానికి తల్లిదండ్రులే కారణమని మానసిక వైద్యులు అంటున్నారు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అయితే వారు తమ విధుల్లోకి వెళ్లి.. పిల్లలు పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఒకవేళ తమ విధుల్లోకి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా పట్టించుకోవడంలేదని అంటున్నారు. దీంతో వారు తల్లిదండ్రులతో మాట్లాడలేక కేవలం సెల్ఫోన్తోనే ఉంటున్నారు. ఫలితంగా సెల్ఫోన్లో వచ్చే వీడియోల ప్రకారం గాని వారు తమ ప్రవర్తనను మార్చుకుంటున్నారు. అలా వారు చూసే వీడియోలు నెగిటివ్ కు సంబంధించినవి అయితే పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారని చెబుతున్నారు. దీనినే Attention Deposit Hyperactive Disaster (ADHD) అని అంటారు. పిల్లలు ఒకే విషయంపై ఏకాగ్రత ఉంచకపోవడం.. తమలో తామే మాట్లాడుకోవడం.. వంటి వింత ప్రవర్తన చేయడాన్ని ఏడి హెచ్డి అని అంటారు. ఇది పిల్లల్లో తీవ్రమైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వైద్యులు సూచిస్తున్న ప్రకారం.. ఈ పరిస్థితి రాకముందే తల్లితండ్రులు బాధ్యత పడాలి. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేసే వారైతే పిల్లల కోసం కనీసం రెండు గంటల పాటు కేటాయించాలి. వారికి స్కూలులో జరిగిన విషయాల పై చర్చించాలి. పిల్లలకు ఏడేళ్ల వయసు వచ్చేవరకు ఆడవారు ఇతర ఉద్యోగాలు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ వయసు తర్వాత వారిలో ఆలోచన విధానం పెరుగుతుంది. చిన్నపిల్లలకు ఎక్కువగా ఆట బొమ్మలు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో బొమ్మలు ఇవ్వడం వల్ల వారు దేనిపైనా కాన్సన్ట్రేషన్ చేయలేక పోతారు.
పిల్లలు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు అంటే అందుకు తల్లిదండ్రులే కారణం. అయితే మానసిక వ్యాధులకు చికిత్స తల్లిదండ్రులే వైద్యులుగా వ్యవహరించాలి. వారితో ఎక్కువ సమయం గడిపి వారికి ఏం కావాలో తెలుసుకోవాలి. వారు ఆందోళన చెందుతే ఎందుకో కారణం తెలుసుకోవాలి. ఇలా ప్రతి విషయంలో వారి వెన్నంటే ఉండడంవల్ల పిల్లల్లో ధైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా వారికి మొబైల్ ఇవ్వకపోవడమే మంచిది. ఒకవేళ ఇప్పటికే వారు దీనికి అలవాటు పడితే మెల్లమెల్లగా.. వారి నుంచి దూరం చేసే ప్రయత్నం చేయాలి.