ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..?

మహిళలు గర్భం దాల్చిన తరువాత తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి మూడు నెలలు క్యాల్షియం మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిది. క్యాల్షియం, ప్రోటీన్లు బిడ్డ వేగంగా పెరగడంలో సహాయం చేస్తాయి. మహిళలు ప్రెగ్నెన్సీ టైమ్ లో పోషకాహారం, సమతులాహారం తీసుకోవాలి. పాలకూర, తృణ ధాన్యాలు, సిట్రస్ పండ్లు, బాదం తీసుకుంటే మహిళలకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. పాలు, […]

Written By: Kusuma Aggunna, Updated On : November 22, 2020 8:24 am
Follow us on


మహిళలు గర్భం దాల్చిన తరువాత తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి మూడు నెలలు క్యాల్షియం మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిది. క్యాల్షియం, ప్రోటీన్లు బిడ్డ వేగంగా పెరగడంలో సహాయం చేస్తాయి. మహిళలు ప్రెగ్నెన్సీ టైమ్ లో పోషకాహారం, సమతులాహారం తీసుకోవాలి. పాలకూర, తృణ ధాన్యాలు, సిట్రస్ పండ్లు, బాదం తీసుకుంటే మహిళలకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. పాలు, పాలతో చేసిన ఇతర ఉత్పత్తులు, గుడ్లు, పండ్లు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంత సమయం రెస్ట్ తీసుకోవడంతో పాటు కష్టమైన పనులను చేయకుండా ఉంటే మంచిది. అల్లం, నిమ్మ, ఉసిరికాయ పచ్చళ్లను తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. చెప్పులు ఏవి సౌకర్యంగా ఉంటాయో వాటిని ఎక్కువగా ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

సౌకర్యవంతంగా ఉండే దుస్తులనే వేసుకుంటే మంచిది. తరచూ బరువును చెక్ చేసుకుంటూ ఉండాలి. రసాయనాలు, పురుగుమందులకు దూరంగా ఉండాలి. కాఫీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ మీకు స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఉంటే ఆ అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలి. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ వైద్యుల సూచనల ప్రకారం ఆహారం, విటమిన్లు తీసుకోవాలి.

ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు డెలివరీ తర్వాత కూడా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. డెలివరీ తర్వాత పచ్చి కూరగాయ ముక్కలు తీసుకుంటూ మెంతుల నీరు తాగితే మంచిది. ప్రతిరోజూ పప్పుతో పాటు నెయ్యి కూడా తీసుకోవాలి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగుతూ కెఫిన్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది.