https://oktelugu.com/

కరోనా వ్యాక్సిన్లు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..? నిజమేమిటంటే..?

ప్రపంచ దేశాల ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం చివరినాటికి లేదా వచ్చే సంవత్సరం మొదటినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రపంచదేశాల్లో ఇప్పటికే రెండు మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకోగా మిగిలిన వ్యాక్సిన్లకు సంబంధించిన తుది దశ ఫలితాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు వెలువడగా ఆ వ్యాక్సిన్లు 90 శాతానికి పైగా సురక్షితం అని తేలడం గమనార్హం. అయితే కరోనా వ్యాక్సిన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 22, 2020 / 08:17 AM IST
    Follow us on


    ప్రపంచ దేశాల ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం చివరినాటికి లేదా వచ్చే సంవత్సరం మొదటినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రపంచదేశాల్లో ఇప్పటికే రెండు మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకోగా మిగిలిన వ్యాక్సిన్లకు సంబంధించిన తుది దశ ఫలితాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు వెలువడగా ఆ వ్యాక్సిన్లు 90 శాతానికి పైగా సురక్షితం అని తేలడం గమనార్హం.

    అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఏర్పడినా చాలామందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నట్టు తేలింది. మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అలసట, కండరాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వ్యాక్సిన్ వేసిన పాంతంలో ఎర్రబడటం, ఇంజెక్షన్ వేసిన చోట నొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సాధారణ దుష్ప్రభావాలు కనిపించాయి.

    ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లలో అలసట, తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్ట్రాజెనెకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ తరువాత వాలంటీర్లలో అలసట, జ్వరం, కండరాల నొప్పులు, వ్యాక్సిన్ వేసిన చోట నొప్పి, తాకితే నొప్పిగా అనిపించడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. అయితే శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తీసుకున్న అందరిలో ఒకే తరహా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెబుతున్నారు.

    అయితే వ్యాక్సిన్ల వల్ల ఏర్పడే దుష్ప్రభావాల ప్రభావం ఒకటి, రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండదు. ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యువకులతో పోలిస్తే వృద్ధుల్లోనే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం గమనార్హం. ఇతర వ్యాక్సిన్లు తీసుకున్నవారిని పరిశీలిస్తే కూడా వృద్ధుల్లో తక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉండటం గమనార్హం.