Food For Children: చిన్న పిల్లలు యాక్టివ్ గా ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. ఈ ఉత్సాహంతో వారికి ఏది పడితే అది తినిపిస్తారు. ముఖ్యంగా హోటళ్లలో, బయట దొరికే జింక్ పుడ్ తినిపిస్తారు. బయట ఫుడ్ టేస్ట్ గా ఉండడంతో పిల్లలు కూడా వాటిపై మనసు పారేసుకుంటారు. అయితే హోటల్ ఫుడ్ కు అలవాటు పడితే ఇంట్లో తిండిని అస్సలు తినరు. దీంతో వారు తినడం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. అందువల్ల ముందు జాగ్రత్తగా వారికి బయటి ఆహారం అలవాటు చేయకుండా ఉండడం మంచిది. వీకెండ్ లేదా… కొన్ని రోజులకొకసారి అయితే పెద్దగా నష్టం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
అయితే సమయాభావం వల్ల చాలా మంది తల్లిదండ్రులు ఉదయం టిఫిన్లు కూడా బయటికెళ్లి తెచ్చి పిల్లలు పెడుతూ ఉంటారు. హోటళ్లలో చాలా వరకు టేస్ట్ గా రావడం కోసం రకరకాల పదార్థాలు కలుపుతారు. ఇవి చిన్న పిల్లలకు రెగ్యులర్ గా పెట్టడం వల్ల వారు అనారోగ్యం బారిన పడతారు. చాలా మంది ఇలా చేయడం వల్ల చిన్న వయసులోనే పెద్ద పెద్ద రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో పిల్లలకు టేస్టీ ఫుడ్ పెట్టాలి. హోటల్ లో లా ఇంట్లో రెసిపీ ఉండదు. ఈ సమయంలో వారిని డ్రై ఫ్రూట్స్ వైపు మళ్లించాలి.
చిన్న పిల్లలు చాలా వరకు ఆహారం తినడానికి ఇష్టపడరు. ఇదే సమయంలో వారికి డ్రై ప్రూట్స్ అలవాటు చేయాలి. ఉదయం వారికి టిఫిన్ ను బదులు బాదం పప్పు గింజలు తినిపించండి. ఇవి ముందు రాత్రి నీళ్లలో నానబెట్టిన తరువాత ఉదయం ఇస్తే వేడి చేయకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు వాల్ నట్స్ కూడా తినిపించండి. ఇక ఎండు ద్రాక్షను ఉదయం తినిపిస్తే వారు రోజంతా యాక్టివ్ గా ఉంటారు.
డ్రైప్రూట్స్ నచ్చని పిల్లలు ఉంటే వారికి బీన్స్ తినిపించడం అలవాటు చేయండి బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, చిక్ పీస్ లాంటివి చూడడానికి ఆకర్షణగా ఉంటాయి. వీటిని ఉడకబెట్టి ఇవ్వడం లేదా కాస్త పోప్ కు వేసి ఇవ్వడం ద్వారా ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి తినడం వల్ల వారికి లీన్ ప్రోటీన్ అందుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ వారికి కడుపు నిండినట్లు అయి ఇతర ఆహారం జోలికి వెళ్లకుండా ఉంటారు. వీలైతే రోజుకు ఒక బాయిల్డ్ ఎగ్ తినిపించండి. ఇందులో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. దీంతో యాక్టివ్ గా ఉండడంతో పాటు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు.