Bro Collections
Bro Collections: బ్రో మూవీ బాక్సాఫీస్ రన్ ముగిసిందని చెప్పొచ్చు. ఈ చిత్ర శుక్రవారం వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. నిజానికి బ్రో చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పోటీ లేదు. కనీసం టైర్ 2 హీరో కూడా విడుదల కాలేదు. ఎవరికీ తెలియని ఒకటి రెండు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. ఈ పరిణామాలు బ్రో మూవీ ఉపయోగించుకుంటుంది అనుకున్నారు. కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. ఇది బేబీ చిత్రానికి ప్లస్ అయినట్లుగా ఉంది. కొన్ని ఏరియాల్లో బ్రో కంటే బేబీ మెరుగైన వసూళ్లు రాబట్టింది.
7వ రోజు బ్రో మూవీ ఏపీ/తెలంగాణాలలో రూ. 55 లక్షల షేర్ వసూలు చేసింది. సెకండ్ వీకెండ్ శుక్రవారం పుంజుకుంటుంది అంటుంటే అది జరగలేదు. 8వ రోజు మరింత తగ్గి స్వల్ప వసూళ్లు సాధించినట్లు సమాచారం. నిన్న బ్రో మూవీ ఉదయం 13.67%, మధ్యాహ్నం 15.86%, ఈవెనింగ్ షోస్ కి 18.26 % ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం. శని, ఆదివారాలు బ్రో ఉపయోగించుకుంటే బ్రేక్ ఈవెన్ కి కొంత మేర దగ్గరవుతుంది.
ఫస్ట్ వీక్ ముగిసే నాటికి బ్రో మూవీ 63.34% రికవరీ సాధించింది. మరో ముప్పై కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెంట్ చేరుకుంటుంది. బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశాడు. నిజానికి సాయి ధరమ్ తేజ్ ప్రధాన హీరో. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఫేమ్ మీదే మార్కెట్ జరిగింది. దీంతో బ్రో మూవీ వరల్డ్ వైడ్ దాదాపు రూ. 97 కోట్లకు బిజినెస్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 81 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్మారు.
బ్రో తమిళ చిత్రం వినోదాయసితం తెలుగు రీమేక్. దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు. త్రివిక్రమ్ కథనం, మాటలు అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. బ్రో చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. జులై 28న బ్రో మూవీ విడుదలైంది.