Nose Bleeding: కొంత మందికి ఉన్నట్టుండి ముక్కు నుంచి రక్తం కారుతుంటుంది. కొంత మందికి ముక్కు నుంచి రక్తం కారడం సర్వసాధారణం కానీ కొందరికి మాత్రం ఇది భయంకరంగా మారవచ్చు. అయితే ఇలా ముక్కు నుంచి రక్తం కారడం రెండు రకాలుగా జరుగుతుంది. ముక్కు మొదటి భాగంలో ఉన్న రక్త నాళాల నుంచి రక్తం కారినప్పుడు ముందు నుంచి రక్తం కారుతుంటుంది. రెండవ రకంలో రక్త నాళాల నుంచి రక్తం కారినప్పుడు పృష్ట ముక్కు నుంచి రక్తం వస్తుంటుంది. అంతేకాదు హిమోఫిలియా అనే వ్యాధి వల్ల కూడా రక్తం కారవచ్చు.
హిమోఫిలియా అంటే?
ఈ వ్యాధి అనేది జన్యుపరమైన వ్యాధి. ప్రధానంగా మనిషి శరీరంలోని రక్తంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి రక్తం త్వరగా గడ్డకట్టదు. అంతేకాదు. గాయం తగిలిన తర్వాత రక్త ప్రవాహం జరుగుతుంటే అసలు ఈ ప్రవాహం ఆగదు. కొన్ని సార్లు రోగి తన ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుంటుంది. ప్రపంచంలో 10000 వేల మందిలో ఒకరికి ఈ వ్యాధి వస్తుంటుంది.
మన దేశంలో ఎలా ఉందంటే..
మన దేశంలో ఈ వ్యాధి బారిన చాలా తక్కువ మంది పడుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ నివేదిక ప్రకారం మన దేశంలో 80000-100000 వరకు తీవ్రమైన హిమోఫిలియా కేసులు ఉన్నాయని అంచనా వేశారు. ఇక మనదేశంలో ఈ కేసుల సంఖ్య కేవలం 19000 మాత్రమే. ఇక హిమోఫిలియా లక్షణాలు ఎలా ఉంటాయంటే.. సాధారణంగా గాయాలు, లోతైన గాయాలు అయిన తర్వాత నిరంతర రక్తస్రావం, మలం, మూత్రంలో రక్తం కనిపించడం జరుగుతుంది. కీళ్లలో నొప్పి, దృఢత్వం, ఎటువంటి కారణం లేకుండానే ముక్కు నుంచి రక్తం వస్తుంది.
భుజం, మోకాలి పై గడ్డ రావడం, చాలా కాలం నుంచి తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసట వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వీటిని మాత్రం అసలు విస్మరించకూడదు. ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. నిపుణుల అభిప్రాయం మేరకు హిమోఫిలియా లక్షణాలను ముందుగానే గుర్తిస్తే చికిత్స సాధ్యం అవుతుంది. మందులతో పాటు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలలో కూడా చికిత్స పొందవచ్చు.